Last Updated:
Life Insurance Corporation of India: దేశ బడ్జెట్ కంటే ఓ సంస్థ దగ్గరే ఎక్కువ ఆస్తులు ఉంటే నమ్మగలరా? 70 ఏళ్లుగా కోట్లాది భారతీయుల జీవితాల్లో భాగమైన ఎల్ఐసీ ఇప్పుడు అలాంటి అరుదైన ఆర్థిక స్థాయికి చేరుకుంది. ఆస్తులు ఎన్ని లక్షల కోట్లో తెలుసా?
దేశ ప్రజల జీవితాల్లో 70 ఏళ్లుగా భాగమైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ఆర్థిక స్థాయికి చేరుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఎల్ఐసీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (AUM) ఏకంగా రూ.57.29 లక్షల కోట్లకు చేరింది. ఈ మొత్తం 2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం చేయనున్న మొత్తం వ్యయం రూ.53.47 లక్షల కోట్ల కంటే కూడా ఎక్కువ. అంటే దేశ కేంద్ర బడ్జెట్ కంటే ఎల్ఐసీ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ దాదాపు రూ.3.82 లక్షల కోట్లు అధికం.

