పార్ట్ 1లో బేసిక్ వివరాలు, ఫోటో ఉంటాయి. ఇది ఎక్కువగా బీఎల్ఓ ముందే నింపి ఇస్తారు. మీరు మీ పేరు, ఈపీఐసీ నంబర్, చిరునామా, తాలూకా, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ సరిగా ఉన్నాయా చూసుకోవాలి. పాత ఫోటో పక్కన ఖాళీ ఉన్న చోట కొత్త పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. పార్ట్ 2 మీ పేరు 2002 ఓటర్ లిస్ట్‌లో ఉన్నప్పుడు మాత్రమే నింపాలి. 2002 లిస్టులో ఉన్నట్లే మీ పేరు రాయాలి, స్పెల్లింగ్ తప్పుగా ఉన్నా అలాగే రాయాలి. ఈపీఐసీ నంబర్ గుర్తు లేకపోతే ఖాళీగా వదిలేయవచ్చు. తండ్రి లేదా తల్లి లేదా భర్త పేరు 2002 రికార్డులో ఉన్నట్లే ఇవ్వాలి. సంబంధం కూడా పేర్కొనాలి. జిల్లా, రాష్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గం, ఏసీ నంబర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ అన్నీ 2002 డేటా ఆధారంగా నింపాలి. (image: AI Generated)

