ప్రభన్యూస్

Nepal-China Border Floods: నేపాల్‌లో ప్రకృతి విలయతాండవం.. 160 మంది మృతి.. 142 మంది భారతీయుల గల్లంతు! |


Last Updated:

Nepal-China Border Floods: నేపాల్, చైనా పరిధిలోని టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి.

నేపాల్ వరదలు
నేపాల్ వరదలు

ఈ ప్రకృతి విపత్తు ధాటికి ఇప్పటివరకు కనీసం 160 మంది మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారు. భారీ ప్రవాహాల కారణంగా వంతెనలు కొట్టుకుపోయాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి మరియు పలు కీలక జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో భోటే కోషి నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ఈ ఆకస్మిక వరద పోటెత్తింది. టిబెట్ ప్రాంతంలో భూకంపం సంభవించిన కొద్దిసేపటికే ఈ వరదలు మొదలయ్యాయని, భూకంపం కారణంగా గ్లేసియల్ సరస్సు బద్దలవడం (గ్లేసియల్ అవుట్‌బర్స్ట్) వల్లే ఈ ఉత్పాతం సంభవించి ఉండవచ్చని నేపాల్ అధికారులు అనుమానిస్తున్నారు. రసువా, ధాదింగ్ జిల్లాల నుంచి నువాకోట్, చిత్వాన్, నవల్‌పరాసి ఈస్ట్ తదితర ప్రాంతాలకు వరదలు వ్యాపించాయి. బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 August 2026, 6:42 am Digital Edition : Prabhanews
Nepal-China Border Floods: నేపాల్‌లో ప్రకృతి విలయతాండవం.. 160 మంది మృతి.. 142 మంది భారతీయుల గల్లంతు! |

Last Updated:Aug 27, 2026 6:02 AM ISTNepal-China Border Floods: నేపాల్, చైనా పరిధిలోని టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి.నేపాల్ వరదలుఈ ప్రకృతి విపత్తు ధాటికి ఇప్పటివరకు కనీసం 160 మంది మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారు. భారీ ప్రవాహాల కారణంగా వంతెనలు కొట్టుకుపోయాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి మరియు పలు కీలక జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో భోటే కోషి నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ఈ ఆకస్మిక వరద పోటెత్తింది. టిబెట్ ప్రాంతంలో భూకంపం సంభవించిన కొద్దిసేపటికే ఈ వరదలు మొదలయ్యాయని, భూకంపం కారణంగా గ్లేసియల్ సరస్సు బద్దలవడం (గ్లేసియల్ అవుట్‌బర్స్ట్) వల్లే ఈ ఉత్పాతం సంభవించి ఉండవచ్చని నేపాల్ అధికారులు అనుమానిస్తున్నారు. రసువా, ధాదింగ్ జిల్లాల నుంచి నువాకోట్, చిత్వాన్, నవల్‌పరాసి ఈస్ట్ తదితర ప్రాంతాలకు వరదలు వ్యాపించాయి. బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.మరింత చదవండి

Source link