Last Updated:
వారాలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు Apple తెరదించింది. సెప్టెంబర్ 9న జరగనున్న భారీ ఈవెంట్‌లో iPhone 18 Pro, Pro Maxతో పాటు Apple తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా తీసుకురాబోతోందా?
టెక్ ప్రపంచంలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. Apple తన తదుపరి కీలక లాంచ్ ఈవెంట్ తేదీని అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 9, బుధవారం నాడు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఈవెంట్‌లో iPhone 18 Pro, iPhone 18 Pro Max సహా పలు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించే అవకాశం ఉంది. అంతేకాకుండా Apple తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్‌ను పరిచయం చేయవచ్చనే అంచనాలు కూడా టెక్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

