ప్రభన్యూస్

YouTuber Prashna Ravan: యూట్యూబర్ ప్రశ్న రావణ్ మళ్లీ అరెస్ట్.. బెయిల్ తర్వాత మరో కేసు.. ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

YouTuber Prashna Ravan: ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను మళ్లీ అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఫైర్ అయ్యారు. ఏమన్నారో తెలుసుకుందాం.

యూట్యూబర్ ప్రశ్న రావణ్ మళ్లీ అరెస్ట్ (Image credit - youtuber - ప్రశ్న (PRASHNA)
యూట్యూబర్ ప్రశ్న రావణ్ మళ్లీ అరెస్ట్ (Image credit – youtuber – ప్రశ్న (PRASHNA)

కాకినాడ: ప్రముఖ యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను మరో కేసులో పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నం పోలీసులు కాకినాడలో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసినా, కొత్త కేసు నమోదు చేసి అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్రశ్న రావణ్ ఏలూరులో దళిత క్రైస్తవ మహాసభలో పాల్గొని ప్రసంగం చేసిన సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత బొజ్జా కుమార్ బాబు ఫిర్యాదు చేయగా, పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో జూన్ 30న హైదరాబాద్‌లో ఆయనను అరెస్టు చేసి పిఠాపురం తరలించారు. విచారణ తర్వాత కోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ వచ్చిన కొద్ది సేపటికే సర్పవరం పోలీసులు మరో కేసులో అతనిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత కనిపించింది. జనసేన నాయకులు, కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకుని గుడ్లు విసిరేందుకు ప్రయత్నించారు. ఐతే.. పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రావణ్‌ను మెడికల్ పరీక్షల కోసం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తరలించేటప్పుడు ఈ ఘటన జరిగింది.

మచిలీపట్నంలోని ఇనగుడూరు పోలీస్ స్టేషన్‌లో జనసేన నాయకులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. గుడివాడ రూరల్ పోలీసులు రావణ్‌ను అదుపులోకి తీసుకుని మచిలీపట్నం తరలించారు. ఇది 2025లో విషయానికి సంబంధించిన కేసు అని సమాచారం. ప్రశ్న రావణ్‌పై మొత్తం 30 దాకా కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి.

నటుడు ప్రకాశ్ రాజ్ ఈ అరెస్టులపై తీవ్ర విమర్శలు చేశారు. “కోర్టులు బెయిల్ ఇస్తుంటే కొత్త కేసులు పెట్టి అరెస్టు చేస్తారా? రావణ్‌పై 30 దాకా కేసులు పెట్టారు. మీ ఫ్రస్ట్రేషన్‌ను ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడి దాకా వెళ్తారు, ఈ కక్షసాధింపు ఏంటి?” అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని, ప్రశ్నలు అడిగినందుకు జైళ్లలో పెట్టడం కుంభకర్ణత్వం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రశ్న రావణ్ ‘ప్రశ్న’ యూట్యూబ్ చానల్ ద్వారా రాజకీయ వ్యాఖ్యలు, విశ్లేషణలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అతని వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదమవుతుంటాయి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. కాగా.. ఇలాంటి అరెస్టులల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. సోషల్ మీడియా లోనైనా, యూట్యూబ్ లోనైనా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే.. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామనే సంకేతం ఇచ్చింది. ఇది చర్చకు దారితీసింది. మరో యూట్యూబర్ కె.వి.రెడ్డి (కెవిఆర్)ని కూడా ఇదే సమయంలో హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఆయన భార్య కంప్లైంట్‌తో.. తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

పోలీసులు రావణ్‌ను కోర్టులో హాజరు పరచి రిమాండ్ కోరినట్లు తాజాగా తెలుస్తోంది. ఈ ఘటనలు రాజకీయ వ్యాఖ్యాతల స్వేచ్ఛ, ప్రభుత్వ బాధ్యతల మధ్య సంబంధాన్ని ప్రశ్నించేలా ఉన్నాయి. ప్రజలు ఈ పరిస్థితులను గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలు దీర్ఘకాలిక పరిణామాలకు దారితీయవచ్చు. ప్రశ్నిస్తే తప్పా అని ప్రకాశ్ రాజ్ లాంటి వారు అడుగుతుంటే.. ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే, చర్యలు తప్పవు అనే సంకేతం ప్రభుత్వం ఇస్తోంది. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనం ప్రజలకే వదిలేయాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 July 2026, 8:08 am Digital Edition : Prabhanews
YouTuber Prashna Ravan: యూట్యూబర్ ప్రశ్న రావణ్ మళ్లీ అరెస్ట్.. బెయిల్ తర్వాత మరో కేసు.. ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 03, 2026 7:44 AM ISTYouTuber Prashna Ravan: ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను మళ్లీ అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఫైర్ అయ్యారు. ఏమన్నారో తెలుసుకుందాం.యూట్యూబర్ ప్రశ్న రావణ్ మళ్లీ అరెస్ట్ (Image credit - youtuber - ప్రశ్న (PRASHNA)కాకినాడ: ప్రముఖ యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను మరో కేసులో పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నం పోలీసులు కాకినాడలో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసినా, కొత్త కేసు నమోదు చేసి అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ప్రశ్న రావణ్ ఏలూరులో దళిత క్రైస్తవ మహాసభలో పాల్గొని ప్రసంగం చేసిన సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత బొజ్జా కుమార్ బాబు ఫిర్యాదు చేయగా, పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో జూన్ 30న హైదరాబాద్‌లో ఆయనను అరెస్టు చేసి పిఠాపురం తరలించారు. విచారణ తర్వాత కోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ వచ్చిన కొద్ది సేపటికే సర్పవరం పోలీసులు మరో కేసులో అతనిని అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత కనిపించింది. జనసేన నాయకులు, కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకుని గుడ్లు విసిరేందుకు ప్రయత్నించారు. ఐతే.. పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రావణ్‌ను మెడికల్ పరీక్షల కోసం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తరలించేటప్పుడు ఈ ఘటన జరిగింది.మచిలీపట్నంలోని ఇనగుడూరు పోలీస్ స్టేషన్‌లో జనసేన నాయకులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. గుడివాడ రూరల్ పోలీసులు రావణ్‌ను అదుపులోకి తీసుకుని మచిలీపట్నం తరలించారు. ఇది 2025లో విషయానికి సంబంధించిన కేసు అని సమాచారం. ప్రశ్న రావణ్‌పై మొత్తం 30 దాకా కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి.నటుడు ప్రకాశ్ రాజ్ ఈ అరెస్టులపై తీవ్ర విమర్శలు చేశారు. "కోర్టులు బెయిల్ ఇస్తుంటే కొత్త కేసులు పెట్టి అరెస్టు చేస్తారా? రావణ్‌పై 30 దాకా కేసులు పెట్టారు. మీ ఫ్రస్ట్రేషన్‌ను ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడి దాకా వెళ్తారు, ఈ కక్షసాధింపు ఏంటి?" అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని, ప్రశ్నలు అడిగినందుకు జైళ్లలో పెట్టడం కుంభకర్ణత్వం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ప్రశ్న రావణ్ 'ప్రశ్న' యూట్యూబ్ చానల్ ద్వారా రాజకీయ వ్యాఖ్యలు, విశ్లేషణలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అతని వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదమవుతుంటాయి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. కాగా.. ఇలాంటి అరెస్టులల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. సోషల్ మీడియా లోనైనా, యూట్యూబ్ లోనైనా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే.. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామనే సంకేతం ఇచ్చింది. ఇది చర్చకు దారితీసింది. మరో యూట్యూబర్ కె.వి.రెడ్డి (కెవిఆర్)ని కూడా ఇదే సమయంలో హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఆయన భార్య కంప్లైంట్‌తో.. తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.పోలీసులు రావణ్‌ను కోర్టులో హాజరు పరచి రిమాండ్ కోరినట్లు తాజాగా తెలుస్తోంది. ఈ ఘటనలు రాజకీయ వ్యాఖ్యాతల స్వేచ్ఛ, ప్రభుత్వ బాధ్యతల మధ్య సంబంధాన్ని ప్రశ్నించేలా ఉన్నాయి. ప్రజలు ఈ పరిస్థితులను గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలు దీర్ఘకాలిక పరిణామాలకు దారితీయవచ్చు. ప్రశ్నిస్తే తప్పా అని ప్రకాశ్ రాజ్ లాంటి వారు అడుగుతుంటే.. ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే, చర్యలు తప్పవు అనే సంకేతం ప్రభుత్వం ఇస్తోంది. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనం ప్రజలకే వదిలేయాలి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link