Last Updated:
నిజానికి అందరికీ ఒకే రకమైన నీరు సరిపోదు. వాతావరణం, సమయం, శరీర పరిస్థితి, వ్యాయామం చేసిన తర్వాత ఉన్న అలసట వంటి విషయాలను బట్టి నీటి ఉష్ణోగ్రతను ఎంచుకోవడం మంచిది.
మనసును, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడంలో స్నానం కూడా ముఖ్యమైన భాగమే. అయితే స్నానం చేసేటప్పుడు చల్లటి నీటిని ఉపయోగించాలా, గోరువెచ్చని నీటిని ఉపయోగించాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది. నిజానికి అందరికీ ఒకే రకమైన నీరు సరిపోదు. వాతావరణం, సమయం, శరీర పరిస్థితి, వ్యాయామం చేసిన తర్వాత ఉన్న అలసట వంటి విషయాలను బట్టి నీటి ఉష్ణోగ్రతను ఎంచుకోవడం మంచిదని అనంతపురం రూరల్ గవర్నమెంట్ హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కార్తీక్ తెలిపారు.

