Last Updated:
Chilli Gardening Tips: వంటగదిలో ఉన్న పండిన పచ్చిమిర్చి నుంచే విత్తనాలు తీసుకుని ఇంట్లోనే సులభంగా మిర్చి మొక్కను పెంచుకోవచ్చు. వర్షాకాలంలో సరైన డ్రైనేజీ, తగినంత వెలుతురు, మట్టి తేమతో జాగ్రత్తగా పెంచితే రెండు నెలల్లోనే తాజా మిర్చి పొందొచ్చు.
Chilli Gardening Tips: ఆగస్టు నెలలో వర్షాకాలం కొనసాగుతోంది. ఈ సమయంలో ఇంటి బాల్కనీ, టెర్రస్ లేదా పెరట్లో కిచెన్ గార్డెనింగ్ చేయాలనుకునేవారికి ఇది మంచి సమయం. ప్రతిరోజూ మార్కెట్ నుంచి పచ్చిమిర్చి కొనాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లో ఉన్న పండిన పచ్చిమిర్చి నుంచే విత్తనాలు తీసుకుని కొత్త మొక్కను పెంచుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఖరీదైన విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు.

