Last Updated:
పూర్ణం బూరెలు, పులిహోర, బెల్లం పరమాన్నం వంటి వాటితో పాటు దద్దోజనం కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. సరైన కొలతలు, ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే గుడిలో ప్రసాదంలా రుచికరమైన దద్దోజనాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలో శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున చాలా మంది మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఆ రోజు వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా వ్రతం చేసుకుంటారు. వరలక్ష్మీదేవిని పూజించి, కుటుంబానికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. పూర్ణం బూరెలు, పులిహోర, బెల్లం పరమాన్నం వంటి వాటితో పాటు దద్దోజనం కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. సరైన కొలతలు, ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే గుడిలో ప్రసాదంలా రుచికరమైన దద్దోజనాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

