నీతి ఆయోగ్‌కు చెందిన డెవలప్‌మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ (DMEO) నిర్వహించిన ప్రభావ అధ్యయనం ప్రకారం, PM-KISAN పథకం తన లక్ష్యాలను సమర్థవంతంగా సాధిస్తోంది. ఈ అధ్యయనం ప్రకారం, 92 శాతానికి పైగా రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి వ్యవసాయ ఉత్పాదకాల కొనుగోలుకు వినియోగించినట్లు వెల్లడైంది. ఇటీవలి కాలంలో సాగు ఖర్చులు పెరగడం, వాతావరణ మార్పుల ప్రభావం అధికమవుతున్న నేపథ్యంలో ఈ నగదు సాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతోందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో రైతుల ఆర్థిక స్థిరత్వం పెరగడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకత కూడా మెరుగుపడుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది.

