ఉక్రెయిన్లోని లవివ్ (Lviv) నగరంపై రష్యా మరోసారి భీకర క్షిపణి దాడులకు తెగబడింది. రష్యన్ మిస్సైళ్లు నేరుగా నివాస సముదాయాలపై పడటంతో పలు బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో భవనాల్లో ఉన్న పలువురు పౌరులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సహాయక బృందాలు (Rescue Teams) శిథిలాలను తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశాయి.
Source link
