ARAI, SIAM, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), IIP, ఆటోమొబైల్ కంపెనీలు కలిసి ల్యాబ్ పరీక్షలు, రోడ్లపై ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించాయి. ఇందులో ఇంజిన్ మన్నిక, డ్రైవింగ్ పనితీరు, వాహనం స్టార్ట్ అయ్యే సామర్థ్యం, తుప్పు నిరోధకత, మెటీరియల్ అనుకూలత, ఉద్గారాలు, ఇంధన సామర్థ్యం వంటి అనేక అంశాలను పరిశీలించారు. ఈ పరీక్షలన్నీ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఈ20 ఇంధనం సురక్షితమని నిర్ధారించాయి. ఈ అధ్యయనాల్లో పాత వాహనాల పనితీరులో కూడా పెద్దగా ఎలాంటి తేడా కనిపించలేదని వెల్లడైంది. ఈ20 వాడటం వల్ల అసాధారణంగా ఇంజిన్ దెబ్బతినడం లేదా ఎక్కువగా అరిగిపోవడం వంటి సమస్యలు గుర్తించలేదు. ల్యాబ్ పరీక్షలు, ఫీల్డ్ ట్రయల్స్, వాస్తవ వినియోగ అనుభవం అన్నింటిలోనూ ఈ20 వల్ల వాహనాల పనితీరుపై విస్తృత స్థాయిలో ప్రతికూల ప్రభావం ఉందని ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రభుత్వం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)

