[title నిజాంసాగర్ చౌరస్తాలో డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు ప్రజల భద్రత.]
🛑 నిజాంసాగర్ చౌరస్తాలో డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు
ప్రజల భద్రత.
ట్రాఫిక్ నియంత్రణకు కామారెడ్డి పోలీసుల చర్య
ప్రభ న్యూస్ కామారెడ్డి జిల్లా ::
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయాలు తగ్గించి, ప్రజల భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో కామారెడ్డి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
కామారెడ్డి పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో, ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్ పర్యవేక్షణలో ఈ బొల్లార్డ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి సమయంలో కూడా వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా వీటిని అమర్చడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ సాయి కృష్ణ, ట్రాఫిక్ సిబ్బంది తిరుపతి, నరేష్, చందు తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

