Amit Shah: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి అమలు.. అమిత్ షా కీలక ప్రకటన! |


Last Updated:

బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో త్వరలోనే యూసీసీ అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మతం ఆధారంగా చట్టాలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.

అమిత్ షా (ఫైల్ ఫోటో)
అమిత్ షా (ఫైల్ ఫోటో)

బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమలు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కీలక ప్రకటన చేశారు. మతం ఆధారంగా చట్టాలు రూపొందించకూడదని స్పష్టం చేస్తూ, రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాల్లో యూసీసీని పొందుపరిచారని ఆయన గుర్తుచేశారు. దేశంలోని హిందూ, సిక్కు, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ సహా ప్రతి పౌరుడికి ఒకే రకమైన చట్టం కింద జీవించే హక్కు ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ ఈ ఆలోచనను పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఆయన విమర్శించారు.

ఇప్పటికే గోవా, ఉత్తరాఖండ్, గుజరాత్, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో యూసీసీ అమలవుతుండగా, మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ దీన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగ అసలు ప్రతిని చేతిలో పట్టుకుని తిరిగే నేతలు పార్లమెంటు లైబ్రరీకి వెళ్లి నందలాల్ బోస్ గీసిన శ్రీరాముడు, బుద్ధుడు, మహావీరుడు, గురు గోవింద్ సింగ్, రాణి లక్ష్మీబాయి, నేతాజీ చిత్రాలను 15 నిమిషాలు పరిశీలించాలని అమిత్ షా సూచించారు.

నక్సలిజం నిర్మూలనతోనే బస్తర్ ప్రజలకు రాజ్యాంగ హక్కులు

దేశంలో రక్తపాతం లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో అధికార మార్పిడి జరగడానికి రాజ్యాంగమే కారణమని అమిత్ షా కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నక్సలిజాన్ని నిర్మూలించడం వల్లే తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు అందుతున్నాయని ఆయన తెలిపారు.

తాను ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి వెళ్లినప్పుడు 80 ఏళ్ల వృద్ధుడి ఇంటికి రేషన్ కార్డు, ఓటరు జాబితాలో పేరు, కరెంటు, తాగునీటి వసతి లేకపోవడాన్ని చూశానని చెప్పారు. నక్సలిజం వల్ల ఆ ప్రాంత ప్రజలు ఎంతగా నష్టపోయారో ఆ ఘటనతో అర్థమైందని, ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తెస్తున్నాయని అమిత్ షా వివరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 November 2026, 7:19 pm Digital Edition : Prabhanews
Amit Shah: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి అమలు.. అమిత్ షా కీలక ప్రకటన! |

Last Updated:November 26, 2026 6:32 PM ISTబీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో త్వరలోనే యూసీసీ అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మతం ఆధారంగా చట్టాలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.అమిత్ షా (ఫైల్ ఫోటో)బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమలు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కీలక ప్రకటన చేశారు. మతం ఆధారంగా చట్టాలు రూపొందించకూడదని స్పష్టం చేస్తూ, రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాల్లో యూసీసీని పొందుపరిచారని ఆయన గుర్తుచేశారు. దేశంలోని హిందూ, సిక్కు, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ సహా ప్రతి పౌరుడికి ఒకే రకమైన చట్టం కింద జీవించే హక్కు ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ ఈ ఆలోచనను పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఆయన విమర్శించారు.ఇప్పటికే గోవా, ఉత్తరాఖండ్, గుజరాత్, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో యూసీసీ అమలవుతుండగా, మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ దీన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగ అసలు ప్రతిని చేతిలో పట్టుకుని తిరిగే నేతలు పార్లమెంటు లైబ్రరీకి వెళ్లి నందలాల్ బోస్ గీసిన శ్రీరాముడు, బుద్ధుడు, మహావీరుడు, గురు గోవింద్ సింగ్, రాణి లక్ష్మీబాయి, నేతాజీ చిత్రాలను 15 నిమిషాలు పరిశీలించాలని అమిత్ షా సూచించారు.నక్సలిజం నిర్మూలనతోనే బస్తర్ ప్రజలకు రాజ్యాంగ హక్కులుదేశంలో రక్తపాతం లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో అధికార మార్పిడి జరగడానికి రాజ్యాంగమే కారణమని అమిత్ షా కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నక్సలిజాన్ని నిర్మూలించడం వల్లే తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు అందుతున్నాయని ఆయన తెలిపారు.తాను ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి వెళ్లినప్పుడు 80 ఏళ్ల వృద్ధుడి ఇంటికి రేషన్ కార్డు, ఓటరు జాబితాలో పేరు, కరెంటు, తాగునీటి వసతి లేకపోవడాన్ని చూశానని చెప్పారు. నక్సలిజం వల్ల ఆ ప్రాంత ప్రజలు ఎంతగా నష్టపోయారో ఆ ఘటనతో అర్థమైందని, ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తెస్తున్నాయని అమిత్ షా వివరించారు.మరింత చదవండి

Source link