అమెరికా తూర్పు తీర ప్రాంతాన్ని శక్తివంతమైన తుపాను వణికించింది. థాంక్స్ గివింగ్ వేడుకల సమయంలో కురిసిన భారీ వర్షాలు, గంటకు 70 మైళ్ల వేగంతో వీచిన బలమైన గాలులతో న్యూజెర్సీలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. న్యూజెర్సీలోని స్టోన్ హార్బర్, సీ ఐల్ సిటీ, మనాస్క్వాన్ ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. సముద్రపు అలలు, అధిక ఆటుపోట్ల కారణంగా తీర ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా చేరింది. వరద నీటిలో వాహనాలు వెళ్లేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.ID_SS
Source link
