Last Updated:
హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రతిభను ఒకచోట చేర్చుతూ, నటి రోజ్ సర్దానా తమిళ నటుడు చరుకేశ్ మంగత్‌తో కలిసి నటించిన ప్రత్యేక పాట షూటింగ్ పూర్తి చేశారు.
హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రతిభను ఒకచోట చేర్చుతూ, నటి రోజ్ సర్దానా తమిళ నటుడు చరుకేశ్ మంగత్‌తో కలిసి నటించిన ప్రత్యేక పాట షూటింగ్ పూర్తి చేశారు. నటి రోజ్ సర్దానా తన సినీ ప్రయాణంలో మరో ఆసక్తికరమైన తమిళ్-హిందీ కలయికలో ప్రాజెక్ట్‌ను జోడించుకున్నారు. ఇటీవలే చరుకేశ్ మంగత్‌తో కలిసి నటించిన ఆ ప్రత్యేక పాట షూటింగ్‌ను ఆమె పూర్తి చేశారు. విభిన్న చిత్ర పరిశ్రమలకు చెందిన ఈ ఇద్దరు నటీనటుల కలయిక ఒక ఆసక్తికరమైన కొత్త భాగస్వామ్యంగా నిలుస్తోంది.
ప్రస్తుతం రోజ్ తన కొత్త చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. చాలా డిఫరెంట్ పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్న ఆమె కెరీర్‌లో ఇది ఒక కీలక దశ. అందుకే స్పెషల్ ఫోకస్ పెట్టి సెలెక్టెడ్ రోల్స్ పోషిస్తున్నారు. గతంలో ఆమె దృశ్యం 2, భూల్ భులైయా 3, వైల్డ్ వైల్డ్ పంజాబ్, ఏక్ చతుర్ నార్, ముక్లావా, గోదాన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జాంబీస్ (ఐఐజెడ్) వంటి చిత్రాల్లో కనిపించారు. విభిన్న చిత్ర ప్రాజెక్టుల ద్వారా తన తెరపై ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు.
ఇటీవల విడుదలైన తమిళ చిత్రం సత్యవాన్ సావిత్రిలో కథానాయకుడిగా నటించిన చరుకేశ్ మంగత్, ఈ ప్రత్యేక పాటలో రోజ్‌తో కలిసి నటించారు. విభిన్న ప్రాంతీయ చిత్ర పరిశ్రమల్లో అనుభవం ఉన్న ఈ ఇద్దరు నటీనటుల కలయిక ఈ పాటను మరింత ప్రత్యేకంగా మార్చింది. ఈ సాంగ్ గురించిన మరిన్ని వివరాలతో పాటు రిలీజ్ డేట్ అతి త్వరలో బయటకు రానుంది.
వైవిధ్యమైన పాత్రలు, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్‌తో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న ఈ రోజ్ సర్దానా.. తన గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో కూడా హంగామా చేస్తూ ఉంటుంది. దీంతో ఆమె పేరు ఆన్ లైన్ మాద్యమాల్లో నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. సినిమాలతో పాటు టెలివిజన్ కార్యక్రమాలు, డిజిటల్ వేదికలలోనూ సమానంగా రాణిస్తున్న రోజ్ సర్దానా, కామెడీతో పాటు సీరియస్ డ్రామా వరకు విభిన్న పాత్రల్లో తన టాలెంట్ చూపిస్తున్నారు.

