Supreme Court: 454 చెట్లు నరికాడు.. సుప్రీం కోర్టు తీర్పుకు గుండె పట్టుకున్నాడు.. రూ. 5 కోట్ల జరిమాన మరీ |


Last Updated:

Supreme Court: పర్యావరణ పరిరక్షణ విషయంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి స్పష్టమైంది.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

ఉత్తరప్రదేశ్‌లోని అత్యంత సున్నితమైన తాజ్ ట్రైపేజియం జోన్ (టీటీజెడ్) పరిధిలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి 454 చెట్లను నరికివేసిన ఓ స్థిరాస్తి వ్యాపారి జైలు శిక్షతో పాటు కోట్ల రూపాయల భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. శంకర్ అగర్వాల్ అనే స్థిరాస్తి వ్యాపారి ఉత్తరప్రదేశ్‌లోని మధుర-బృందావన్ ప్రాంతంలో రక్షిత అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న రహదారి చెంతనే ‘దాల్మియా ఫామ్స్’ను కొనుగోలు చేశాడు. ఆ భూమి అతని సొంతమే అయినప్పటికీ, ఆ ప్రాంతం సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ కమిటీ పర్యవేక్షణ పరిధిలో ఉంది. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరకడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ శంకర్ అగర్వాల్ తన స్థిరాస్తి వ్యాపారంలో భాగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు 2024 సెప్టెంబరులో రాత్రికి రాత్రే ఏకంగా 454 వృక్షాలను కూల్చివేశాడు.

ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఏ.ఎస్. ఓక నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం 2025 మార్చిలో సంచలన ఆదేశాలు జారీ చేసింది. నరికివేసిన ఒక్కో వృక్షానికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 4.54 కోట్ల జరిమానా విధించి, ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశాల మేరకు వ్యాపారి ఆ జరిమానా చెల్లించడంతో పాటు, పర్యావరణ నష్టపరిహారంగా మరో రూ. 2 కోట్లను వెచ్చించి 9 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిని అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాడు. అంతేకాకుండా, ఈ కేసులో సదరు వ్యాపారి నెల రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడని గురువారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా వ్యాపారి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి వివరించారు.

ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, కోర్టు ధిక్కరణ కేసును ముగిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. కేసు ముగింపులో భాగంగా శంకర్ అగర్వాల్‌కు అదనంగా మరో రూ. 50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పర్యావరణ నిబంధనలను అతిక్రమించి చెట్లను నరికివేయడం వల్ల ఆ వ్యాపారికి మొత్తంగా జైలు శిక్షతో పాటు సుమారు రూ. 7.04 కోట్ల భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లయింది. పర్యావరణానికి హాని తలపెట్టే వారికి ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరికగా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 8:07 am Digital Edition : Prabhanews
Supreme Court: 454 చెట్లు నరికాడు.. సుప్రీం కోర్టు తీర్పుకు గుండె పట్టుకున్నాడు.. రూ. 5 కోట్ల జరిమాన మరీ |

Last Updated:Nov 21, 2026 7:42 AM ISTSupreme Court: పర్యావరణ పరిరక్షణ విషయంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి స్పష్టమైంది.ఫైల్ ఫోటోఉత్తరప్రదేశ్‌లోని అత్యంత సున్నితమైన తాజ్ ట్రైపేజియం జోన్ (టీటీజెడ్) పరిధిలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి 454 చెట్లను నరికివేసిన ఓ స్థిరాస్తి వ్యాపారి జైలు శిక్షతో పాటు కోట్ల రూపాయల భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. శంకర్ అగర్వాల్ అనే స్థిరాస్తి వ్యాపారి ఉత్తరప్రదేశ్‌లోని మధుర-బృందావన్ ప్రాంతంలో రక్షిత అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న రహదారి చెంతనే 'దాల్మియా ఫామ్స్'ను కొనుగోలు చేశాడు. ఆ భూమి అతని సొంతమే అయినప్పటికీ, ఆ ప్రాంతం సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ కమిటీ పర్యవేక్షణ పరిధిలో ఉంది. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరకడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ శంకర్ అగర్వాల్ తన స్థిరాస్తి వ్యాపారంలో భాగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు 2024 సెప్టెంబరులో రాత్రికి రాత్రే ఏకంగా 454 వృక్షాలను కూల్చివేశాడు.ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఏ.ఎస్. ఓక నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం 2025 మార్చిలో సంచలన ఆదేశాలు జారీ చేసింది. నరికివేసిన ఒక్కో వృక్షానికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 4.54 కోట్ల జరిమానా విధించి, ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది.కోర్టు ఆదేశాల మేరకు వ్యాపారి ఆ జరిమానా చెల్లించడంతో పాటు, పర్యావరణ నష్టపరిహారంగా మరో రూ. 2 కోట్లను వెచ్చించి 9 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిని అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాడు. అంతేకాకుండా, ఈ కేసులో సదరు వ్యాపారి నెల రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడని గురువారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా వ్యాపారి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి వివరించారు.ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, కోర్టు ధిక్కరణ కేసును ముగిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. కేసు ముగింపులో భాగంగా శంకర్ అగర్వాల్‌కు అదనంగా మరో రూ. 50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పర్యావరణ నిబంధనలను అతిక్రమించి చెట్లను నరికివేయడం వల్ల ఆ వ్యాపారికి మొత్తంగా జైలు శిక్షతో పాటు సుమారు రూ. 7.04 కోట్ల భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లయింది. పర్యావరణానికి హాని తలపెట్టే వారికి ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరికగా నిలిచింది.మరింత చదవండి

Source link