బంగారం, వెండి కొనాలని చూసేవారికి బంపర్ గుడ్ న్యూస్. ఈ వారం వీటి ధరలు అత్యంత భారీగా తగ్గాయి. గత కొన్ని వారాలుగా నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతూ సామాన్యులకు అందనంత దూరంలో ఉన్న పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. అక్టోబర్ నెలలో ఆరంభమైన ఈ తగ్గుదల ధోరణి, ఈనెల ప్రారంభంలో కొంతకాలం పాటు బ్రేక్ పడి మళ్లీ ధరలు పెరిగినప్పటికీ, ప్రస్తుత వారంలో మాత్రం ఊహించని రీతిలో పడిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై నెలకొన్న భయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశీయ బులియన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా ఈ వారం రోజుల్లోనే బంగారం, వెండి ధరలు అత్యంత భారీగా పడిపోయి. కొనాలని ప్లాన్ చేసేవారికి భారీ ఊరటనిచ్చాయని చెప్పుకోవాలి.

