స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్స్, వాటి మధ్య ఉన్న కనెక్టివిటీ, ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు ఎక్కడ ఉన్నాయనే వివరాలను ఇంటరాక్టివ్ మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. టాయిలెట్లు, తాగునీరు, ఫుడ్ స్టాల్స్, వెయిటింగ్ హాళ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి సదుపాయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. భోలు సేవలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేసిన హైదరాబాద్ డివిజన్ బృందాన్ని ఆయన అభినందించారు. హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ నాయకత్వంలో, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ డాక్టర్ అనిరుధ్ పామర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలైంది. ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు బృందం చేసిన కృషిని జనరల్ మేనేజర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. (ప్రతీకాత్మక చిత్రం)

