ప్రభన్యూస్

Ranabaali OTT: ఓటీటీ లోకి వచ్చేసిన రణబాలి.. ఇదిగో స్ట్రీమింగ్ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రూపొందిన రణబాలి మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ చూద్దామా..

News18
News18

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత తొలిసారిగా జంటగా నటించిన భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకోగా, సరిగ్గా నాలుగు వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేస్తోంది. ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా నేటి (నవంబర్ 13, శుక్రవారం) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాను తెరకెక్కించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో, రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. హాలీవుడ్ ‘మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించడం పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈశ్వరీ రావు, మలయాళ నటుడు లాల్, రాజా రవీంద్ర, వినోద్ సాగర్, మైమ్ మధు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ అందించిన సంగీతం అందించారు.

కథ విషయానికి వస్తే.. 1878 కాలం నాటి బ్రిటిష్ పాలనలో ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీ, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చిన భయంకరమైన కరువు (గ్రేట్ ఫామిన్) నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. భద్ర మల్లన్న (లాల్) ఆశీస్సులతో రాజమ్మ (ఈశ్వరీ రావు)కు జన్మించిన బిడ్డ రణబాలి (విజయ్ దేవరకొండ). చావును జయించి పుట్టిన అతనికి కేవలం రెండు పుష్కరాల (24 ఏళ్లు) ఆయుష్షు మాత్రమే ఉంటుందని జోస్యం చెబుతారు. అదే సమయంలో కరువుతో అల్లాడుతున్న ప్రజల మీద కనికరం లేకుండా, వారి దగ్గర ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని బలవంతంగా లాక్కుంటూ విపరీతమైన పన్నులు విధిస్తాడు బ్రిటిష్ కమిషనర్ థియోడర్ హెక్టర్ (ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ). ఆ రాక్షస దొర ఆగడాలను అడ్డుకుని, ప్రజల ఆకలి తీర్చడానికి రణబాలి చేసిన వీరోచిత పోరాటం, ఈ క్రమంలో అతని భార్య జయమ్మ (రష్మిక) చేసిన త్యాగం సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి.

థియేటర్లలో ఈ ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్‌ను మిస్ అయిన వారు, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో చూస్తూ ఇంటిల్లిపాదీ కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఓటీటీలోనూ ఈ జంట వ్యూవర్‌షిప్ పరంగా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 10:12 am Digital Edition : Prabhanews
Ranabaali OTT: ఓటీటీ లోకి వచ్చేసిన రణబాలి.. ఇదిగో స్ట్రీమింగ్ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 13, 2026 10:09 AM ISTవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రూపొందిన రణబాలి మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ చూద్దామా.. News18టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత తొలిసారిగా జంటగా నటించిన భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' (Ranabaali) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకోగా, సరిగ్గా నాలుగు వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేస్తోంది. ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా నేటి (నవంబర్ 13, శుక్రవారం) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.'టాక్సీవాలా', 'శ్యామ్ సింగ రాయ్' డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాను తెరకెక్కించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో, రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. హాలీవుడ్ 'మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించడం పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈశ్వరీ రావు, మలయాళ నటుడు లాల్, రాజా రవీంద్ర, వినోద్ సాగర్, మైమ్ మధు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ అందించిన సంగీతం అందించారు.కథ విషయానికి వస్తే.. 1878 కాలం నాటి బ్రిటిష్ పాలనలో ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీ, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చిన భయంకరమైన కరువు (గ్రేట్ ఫామిన్) నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. భద్ర మల్లన్న (లాల్) ఆశీస్సులతో రాజమ్మ (ఈశ్వరీ రావు)కు జన్మించిన బిడ్డ రణబాలి (విజయ్ దేవరకొండ). చావును జయించి పుట్టిన అతనికి కేవలం రెండు పుష్కరాల (24 ఏళ్లు) ఆయుష్షు మాత్రమే ఉంటుందని జోస్యం చెబుతారు. అదే సమయంలో కరువుతో అల్లాడుతున్న ప్రజల మీద కనికరం లేకుండా, వారి దగ్గర ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని బలవంతంగా లాక్కుంటూ విపరీతమైన పన్నులు విధిస్తాడు బ్రిటిష్ కమిషనర్ థియోడర్ హెక్టర్ (ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ). ఆ రాక్షస దొర ఆగడాలను అడ్డుకుని, ప్రజల ఆకలి తీర్చడానికి రణబాలి చేసిన వీరోచిత పోరాటం, ఈ క్రమంలో అతని భార్య జయమ్మ (రష్మిక) చేసిన త్యాగం సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి.థియేటర్లలో ఈ ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్‌ను మిస్ అయిన వారు, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో చూస్తూ ఇంటిల్లిపాదీ కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఓటీటీలోనూ ఈ జంట వ్యూవర్‌షిప్ పరంగా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.మరింత చదవండి

Source link