విశాఖలో సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు గ్రాండ్ గా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పియూష్ గోయల్ హాజరయ్యారు. ఈ సంరద్భంగా మాట్లాడుతూ.. విశాఖ సుందరమైన ప్రాంతం అన్నారు. చంద్రబాబుతో తనకు 20 ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు. చంద్రబాబు వంటి సమర్థ నాయకత్వంలో రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చారన్నారు పీయూష్.
పెట్టుబడిదారులకు రక్షణ చట్టం తీసుకురావాలని.. విశాఖ వేదికగా కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదన పెట్టారు. ప్రభుత్వాలు మారిన పెట్టుబడిదారులకు నష్టం జరగకూడదన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏదైనా మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకుంటారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘పీయూష్ గోయల్‌ను 20 ఏళ్లుగా చూస్తున్నా. పరిశ్రమల మంత్రిగా ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారని కొనియాడారు చంద్రబాబు.
పెట్టుబడులకు నమ్మకమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు. 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఆంధ్రప్రదేశ్ బలం అని వివరించారు. ఆంధ్రప్రదేశ్ సాంకేతికతను అందిపుచ్చుకుంటోందని తెలిపారు.
రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీగా ఉన్న సజ్జనర్ (ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా బదిలీ అయ్యారు. ఎస్పీఎఫ్ డీజీగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సజ్జనర్ స్థానంలో హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్ నియమితులయ్యారు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్, ఎండీగా అనిల్ కుమార్, జైళ్లశాఖ డీజీగా స్వాతి లక్రా, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీగా సౌమ్య మిశ్రా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నాగిరెడ్డి, ఏసీబీ డీజీగా చారు సిన్హాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం అయ్యింది. ఈ ఘటన నుంచి తాను క్షేమంగా బయట పడినట్లు ఆయన వీడియో విడుదల చేశారు. ‘‘నిన్న రాత్రి ఓ పాట చిత్రీకరణ కోసం వెళ్లాం. తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో షూట్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో మా కారు ప్రమాదానికి గురైందన్నారు. దీంతో కారు తీవ్రంగా దెబ్బతిందన్నారు. ప్రమాద సమయంలో వాహనంలో నలుగురం ఉన్నామన్నారు. అయ్యప్పస్వామి దయ వల్ల వారికి ఏం కాలేదని చెప్పారు.
వింటర్ సెషన్స్‌కు ముందు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఎజెండాతో సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. మిత్రపక్షాల సహకారంతో బిల్ పాస్ అవుతుందనే ధీమాతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అటు SIRపై ప్రతిపక్షాలు పట్టుబడుతున్న చర్చకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో వింటర్ సెషన్స్ మొదలయ్యే ఛాన్సుంది.
ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్ (Jensen Huang) గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్విడియా బోర్డు ఆయన్ను సీఈఓ పదవి నుంచి తప్పించేందుకు యోచిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. జెన్సన్ను తొలగిస్తే.. తన కంపెనీలో నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.
శుక్రవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. నవంబర్ 12న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా, దీని ప్రభావంతో నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి, నవంబర్ 14 నాటికి సుస్పష్టమైన అల్పపీడనంగా, నవంబర్ 15 నాటికి వాయుగుండంగా (Depression) బలపడే అవకాశం ఉంది.ఈ ప్రభావంతో నవంబర్ 14 నుంచి 16 మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ , అండమాన్ దీవుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, వడ్డీరేట్ల పెంపు అంచనాలతో అంతర్జాతీయ విపణిలో ఈ లోహాల నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి. గురువారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ విపణిలో 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పసిడి ధర (Gold Rate in Hyderabad) రూ.1,42,350కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే పుత్తడి (Gold) ధర దాదాపు రూ.1400 తగ్గింది.
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన వారంలోనే భారత్‌లో రూ.500 కోట్ల నెట్ వసూళ్ల మైలురాయిని దాటింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పౌరాణిక చిత్రం నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విదేశాల్లోనూ ‘రామాయణ’కు మంచి స్పందన లభిస్తోంది. ఏడో రోజు ఓవర్సీస్ మార్కెట్లలో సుమారు రూ.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో విదేశాల్లో మొత్తం వసూళ్లు రూ.323.50 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.934.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా వేశాయి. ఈ వారంలోనే రూ.1,000 కోట్ల క్లబ్లో చేరడం సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
