సామాజిక-ఆర్థిక, కుల గణన (ఎస్ఈసీసీ) 2011లో గుర్తించిన అర్హులైన కుటుంబాలకు ప్రధానంగా ఈ పథకం వర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్దిష్ట పేదరిక పరిస్థితులు, పట్టణ ప్రాంతాల్లో వృత్తుల ఆధారంగా లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని కూలీలు, ప్రభుత్వం నిర్దేశించిన పేదరిక పరిస్థితుల్లో ఉన్న కొన్ని కుటుంబాలు ఈ పథకానికి అర్హత పొందుతాయి. పట్టణ ప్రాంతాల్లో కొన్ని వృత్తులకు చెందిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. వీరిలో ఇంటి పనులు చేసే కార్మికులు, వీధి వ్యాపారులు, నిర్మాణ రంగ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, టైలర్లు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మరికొన్ని వర్గాల వారిని కూడా ఈ పథకంలో చేర్చారు. (ప్రతీకాత్మక చిత్రం)

