రైలు నంబర్ 07197 (చర్లపల్లి – కొల్లాం స్పెషల్) డిసెంబర్ 2, 9, 16, 23 తేదీల్లో బుధవారాల్లో రాత్రి 11.45 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 7.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07198 (కొల్లాం – చర్లపల్లి స్పెషల్) డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో శుక్రవారాల్లో ఉదయం 10.55 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరుతుంది. శనివారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ మూడు జతల రైళ్లు (07180/07181, 07195/07196, 07197/07198) నల్గొండ, మిర్యాలగూడ మీదుగా నడుస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. వీటి స్టాపేజీలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, పెరంబూర్, అరక్కోణం, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్లా, చెంగన్నూర్, మావేలికర, కాయంకుళం. కొన్ని సర్వీసులు కరునాగపల్లి, శాస్తాంకొట్ట స్టేషన్లలో కూడా ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)

