Last Updated:
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ ఓటీటీ లోకి వచ్చేసింది. వివరాల్లోకి పోతే..
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ ఓటీటీ లోకి వచ్చేసింది. థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టి కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా, నవంబర్ 12 అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ 5 భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
గతేడాది వచ్చిన ‘జైలర్’ సాధించిన సంచలన విజయంతో, దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అభిమానుల అంచనాలను ఏమాత్రం తగ్గకుండా అలరించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, విడుదలైన కేవలం 27 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.831 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఇండియాలో దాదాపు రూ.470 కోట్ల నెట్ కలెక్షన్లు, రూ.556 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి తలైవా స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా రజినీకాంత్ కెరీర్లోనే మరో మైలురాయిగా నిలిచింది. రజినీకాంత్ స్టైల్, నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ, ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ అందించిన గూస్బంప్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
మొదటి భాగంలో వర్మన్ విగ్రహాల స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని కూల్చేసి, తప్పు చేసిన తన కొడుకు అర్జున్ను సైతం చంపేసిన టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్).. ఈ పార్ట్ 2లో తన కుటుంబంతో కలిసి ప్రశాంతమైన సాధారణ జీవితం గడపాలని అనుకుంటాడు. కానీ, గతం అతన్ని వదిలిపెట్టదు. వర్మన్ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు అతని స్నేహితుడు దిలీప్ (సూరజ్ వెంజరమూడు) రంగంలోకి దిగుతాడు. మరోవైపు విగ్రహాల స్మగ్లింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులైన పవర్ఫుల్ ‘కల్పక్’ కుటుంబం టైగర్‌ను టార్గెట్ చేస్తుంది. బోధి కల్పక్ (ఎస్.జే. సూర్య), కాంతా కల్పక్ (విద్యాబాలన్) తమ సామ్రాజ్యానికి అడ్డుగా ఉన్న టైగర్ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తారు. తన కుటుంబానికి ప్రాణాపాయం ఉందని గ్రహించిన ముత్తువేల్ పాండియన్.. మరోసారి తన పాత ‘జైలర్’ అవతారాన్ని బయటకు తీస్తాడు. కల్పక్ కుటుంబాన్ని, వారి క్రిమినల్ సామ్రాజ్యాన్ని టైగర్ ఎలా మట్టుబెట్టాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే ‘జైలర్ 2’ అసలు కథ.
యాక్షన్, ఎమోషన్, అదిరిపోయే స్టార్ క్యాస్ట్‌తో థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ‘జైలర్ 2’, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి మరి.

