ప్రభన్యూస్

Hyderabad Cyber Crime: అక్కా.. నీ తమ్ముడిని అంటూ రూ.23లక్షలు కాజేశాడు.. కట్ చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్! | తెలంగాణ వార్తలు


Last Updated:

Hyderabad Cyber Crime: నమ్మకం చాలా ప్రమాదకరమైనది. నమ్మితే.. మంచైనా జరగొచ్చు లేదా చెడైనా జరగొచ్చు. అందుకే.. చాలా మంది నమ్మి మోసపోయాను అంటుంటారు. అలా ఓ మహిళ కుడా మోసపోయిన విధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఏమైందో తెలుసుకుందాం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

సైబర్ మోసాలు ఎప్పుడూ.. డబ్బుతో లింక్ అయ్యి ఉంటాయి. ఏం చేసైనా డబ్బు లాగేయాలి అనేది సైబర్ నేరగాళ్ల ప్లాన్. కానీ.. ఆ ఉచ్చులో ప్రజలు ఎలా చిక్కుకుంటున్నారు అనేది ఆశ్చర్యకర అంశం. ఎన్నో రకాల సైబర్ మోసాలు. కేటుగాళ్లు కొత్త విధానంలో మోసాలకు తెరతీస్తున్నారు. అందువల్లే బాధితులు బుక్కైపోతున్నారు. హైదరాబాద్‌లో వెలుగుజూసిన ఈ క్రైమ్ కథ అలాంటిదే.

ఆంధ్రజ్యోతి రిపోర్టు ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆ మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్.. తెల్లాపూర్‌లో ఉంటోంది. ఆమె తమ్ముడు రవిచంద్ర 2023లో చనిపోయాడు. తల్లి 2024లో చనిపోయింది. తల్లి వాడిన మొబైల్‌ని ఆమె వాడుతోంది. ఆ ఫోన్‌కి ఓ వ్యక్తి కాల్‌ చేశాడు. తన పేరు రాహుల్‌ అన్నాడు. “నేను రవిచంద్ర ఫ్రెండుని. తను నాకు డబ్బులివ్వాలి. బాకీ వున్నాడు” అని చెప్పాడు. ఆమె.. రవిచంద్ర చనిపోయాడని చెప్పడంతో.. కాల్ కట్ చేశాడు.

ఇవి కూడా చదవండి: AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతం అల్లకల్లోలం.. ఏపీ, తెలంగాణకు 6 రోజులు వర్ష సూచన.!

కొన్ని రోజులకు మళ్లీ అతనే కాల్ చేశాడు. గొంతు వాయిస్ మార్చాడు. “అక్కా.. నేనే రవిచంద్రని.. నీ తమ్ముణ్ని కాల్ చేస్తున్నా.. నేను బతికే ఉన్నాను. కొన్ని కారణాల వల్ల.. నిన్న కలవలేదు” అని చెప్పాడు. ఆమె అస్సలు నమ్మలేదు. “సరే.. నీ తమ్ముణ్ని అని ప్రూవ్ చేసుకుంటా..” అంటూ.. ఇంట్లో వస్తువులు, నగలు, కుటుంబ సభ్యుల పేర్లు, చిన్నప్పటి ఘటనలు, ఊళ్లో ఇంటి వివరాలు, ఇంట్లో దాచిన నగల వివరాలు.. అన్నీ చెప్పాడు. అవన్నీ కరెక్టుగా చెప్పడంతో ఆమె షాక్ అయ్యింది.

“నువ్వు నా తమ్ముడివైతే.. మరి మేము ఎవరికి అంత్యక్రియలు చేశాం?” అనే ప్రశ్న ఆమె నుంచి వచ్చింది. “అది వదిలేయ్ అక్కా.. ఓ పని చెయ్యి.. నా పేరున లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. నేను చనిపోయానని చెప్పి.. ఆ డబ్బు తీసుకొని నాకు పంపు” అన్నాడు. అంతే కాదు.. “ఊళ్లో ఉన్న ఇల్లు అమ్మి డబ్బు ఇవ్వు. లేదంటే.. నువ్వు ఎవర్నో చంపి, శవాన్ని తగలబెట్టావని ఊళ్లో చెబుతా. నీ పరువు తీస్తా” అని బెదిరించాడు. ఇదంతా నిజమేనేమో అనుకుంది ఆమె. తాను నిజంగానే వేరే వ్యక్తికి అంత్యక్రియలు చేశానేమో అని ఆమె భయపడింది. ఇక అప్పటి నుంచి అతనికి డబ్బు ఇస్తూనే ఉంది. అలా.. రూ.23 లక్షలు సమర్పించింది. అయినా ఆ కేటుగాడు వెనక్కి తగ్గలేదు.

ఇవి కూడా చదవండి: Date Seed Coffee: ఖర్జూరం గింజల కాఫీ.. నో కెఫీన్.. రుచికరం, ఆరోగ్యం.. ఇలా ప్రిపేర్ చేసుకోండి

తాజాగా ఆ దుండగుడు.. డబ్బు ఇవ్వకపోతే.. నీ భర్తనూ, నీ పిల్లల్నీ చంపుతా అని బెదిరించాడు. ఇక అతని ఆగడాలు భరించలేక.. ఆమె సైబరాబాద్.. సైబర్‌ క్రైం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కేసు రాసిన పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు చెయ్యగా.. దుండగుడు 4 మొబైల్ నంబర్లు వాడుతున్నాడని తెలుసుకున్నారు. అతని బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకుంటున్నారు.

ఈ స్టోరీలో మనకు వచ్చే డౌట్ ఏంటంటే.. ఆ దుండగుడు.. ఆమెతో చిన్నప్పటి వివరాలు కూడా కరెక్టుగా ఎలా చెప్పగలిగాడు అనేది. ఆమె అనుమానం ఏంటంటే.. ఎవరో బాగా తెలిసిన వాళ్లే ఇదంతా చేస్తున్నారనీ.. తన తమ్ముడు నిజంగానే చనిపోయాడని నమ్ముతోంది. అందువల్ల ఇలాంటి సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఇచ్చేటప్పుడు నిజంగా వ్యక్తులను చూశాకే ఇవ్వాలి. ఇలా ఫోన్ కాల్స్‌ని నమ్మితే.. మోసపోయే ప్రమాదం ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 9:11 am Digital Edition : Prabhanews
Hyderabad Cyber Crime: అక్కా.. నీ తమ్ముడిని అంటూ రూ.23లక్షలు కాజేశాడు.. కట్ చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 18, 2026 9:02 AM ISTHyderabad Cyber Crime: నమ్మకం చాలా ప్రమాదకరమైనది. నమ్మితే.. మంచైనా జరగొచ్చు లేదా చెడైనా జరగొచ్చు. అందుకే.. చాలా మంది నమ్మి మోసపోయాను అంటుంటారు. అలా ఓ మహిళ కుడా మోసపోయిన విధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఏమైందో తెలుసుకుందాం.ప్రతీకాత్మక చిత్రంసైబర్ మోసాలు ఎప్పుడూ.. డబ్బుతో లింక్ అయ్యి ఉంటాయి. ఏం చేసైనా డబ్బు లాగేయాలి అనేది సైబర్ నేరగాళ్ల ప్లాన్. కానీ.. ఆ ఉచ్చులో ప్రజలు ఎలా చిక్కుకుంటున్నారు అనేది ఆశ్చర్యకర అంశం. ఎన్నో రకాల సైబర్ మోసాలు. కేటుగాళ్లు కొత్త విధానంలో మోసాలకు తెరతీస్తున్నారు. అందువల్లే బాధితులు బుక్కైపోతున్నారు. హైదరాబాద్‌లో వెలుగుజూసిన ఈ క్రైమ్ కథ అలాంటిదే.ఆంధ్రజ్యోతి రిపోర్టు ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆ మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్.. తెల్లాపూర్‌లో ఉంటోంది. ఆమె తమ్ముడు రవిచంద్ర 2023లో చనిపోయాడు. తల్లి 2024లో చనిపోయింది. తల్లి వాడిన మొబైల్‌ని ఆమె వాడుతోంది. ఆ ఫోన్‌కి ఓ వ్యక్తి కాల్‌ చేశాడు. తన పేరు రాహుల్‌ అన్నాడు. "నేను రవిచంద్ర ఫ్రెండుని. తను నాకు డబ్బులివ్వాలి. బాకీ వున్నాడు" అని చెప్పాడు. ఆమె.. రవిచంద్ర చనిపోయాడని చెప్పడంతో.. కాల్ కట్ చేశాడు.ఇవి కూడా చదవండి: AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతం అల్లకల్లోలం.. ఏపీ, తెలంగాణకు 6 రోజులు వర్ష సూచన.!కొన్ని రోజులకు మళ్లీ అతనే కాల్ చేశాడు. గొంతు వాయిస్ మార్చాడు. "అక్కా.. నేనే రవిచంద్రని.. నీ తమ్ముణ్ని కాల్ చేస్తున్నా.. నేను బతికే ఉన్నాను. కొన్ని కారణాల వల్ల.. నిన్న కలవలేదు" అని చెప్పాడు. ఆమె అస్సలు నమ్మలేదు. "సరే.. నీ తమ్ముణ్ని అని ప్రూవ్ చేసుకుంటా.." అంటూ.. ఇంట్లో వస్తువులు, నగలు, కుటుంబ సభ్యుల పేర్లు, చిన్నప్పటి ఘటనలు, ఊళ్లో ఇంటి వివరాలు, ఇంట్లో దాచిన నగల వివరాలు.. అన్నీ చెప్పాడు. అవన్నీ కరెక్టుగా చెప్పడంతో ఆమె షాక్ అయ్యింది."నువ్వు నా తమ్ముడివైతే.. మరి మేము ఎవరికి అంత్యక్రియలు చేశాం?" అనే ప్రశ్న ఆమె నుంచి వచ్చింది. "అది వదిలేయ్ అక్కా.. ఓ పని చెయ్యి.. నా పేరున లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. నేను చనిపోయానని చెప్పి.. ఆ డబ్బు తీసుకొని నాకు పంపు" అన్నాడు. అంతే కాదు.. "ఊళ్లో ఉన్న ఇల్లు అమ్మి డబ్బు ఇవ్వు. లేదంటే.. నువ్వు ఎవర్నో చంపి, శవాన్ని తగలబెట్టావని ఊళ్లో చెబుతా. నీ పరువు తీస్తా" అని బెదిరించాడు. ఇదంతా నిజమేనేమో అనుకుంది ఆమె. తాను నిజంగానే వేరే వ్యక్తికి అంత్యక్రియలు చేశానేమో అని ఆమె భయపడింది. ఇక అప్పటి నుంచి అతనికి డబ్బు ఇస్తూనే ఉంది. అలా.. రూ.23 లక్షలు సమర్పించింది. అయినా ఆ కేటుగాడు వెనక్కి తగ్గలేదు.ఇవి కూడా చదవండి: Date Seed Coffee: ఖర్జూరం గింజల కాఫీ.. నో కెఫీన్.. రుచికరం, ఆరోగ్యం.. ఇలా ప్రిపేర్ చేసుకోండితాజాగా ఆ దుండగుడు.. డబ్బు ఇవ్వకపోతే.. నీ భర్తనూ, నీ పిల్లల్నీ చంపుతా అని బెదిరించాడు. ఇక అతని ఆగడాలు భరించలేక.. ఆమె సైబరాబాద్.. సైబర్‌ క్రైం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కేసు రాసిన పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు చెయ్యగా.. దుండగుడు 4 మొబైల్ నంబర్లు వాడుతున్నాడని తెలుసుకున్నారు. అతని బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకుంటున్నారు.ఈ స్టోరీలో మనకు వచ్చే డౌట్ ఏంటంటే.. ఆ దుండగుడు.. ఆమెతో చిన్నప్పటి వివరాలు కూడా కరెక్టుగా ఎలా చెప్పగలిగాడు అనేది. ఆమె అనుమానం ఏంటంటే.. ఎవరో బాగా తెలిసిన వాళ్లే ఇదంతా చేస్తున్నారనీ.. తన తమ్ముడు నిజంగానే చనిపోయాడని నమ్ముతోంది. అందువల్ల ఇలాంటి సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఇచ్చేటప్పుడు నిజంగా వ్యక్తులను చూశాకే ఇవ్వాలి. ఇలా ఫోన్ కాల్స్‌ని నమ్మితే.. మోసపోయే ప్రమాదం ఉంటుంది.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link