Last Updated:
ఆరుగురు పతివ్రతలు .. ఇప్పటి జనరేషన్‌కు ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు కానీ.. 90’s కిడ్స్ను అడిగితే రాజమౌళి కంటే గొప్పగా వివరిస్తారు. అసలు అప్పట్లో ఈ సినిమా చూడడానికి కుర్రాకారు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. లిటరల్‌గా రక్తాలు చిందించేవాళ్లు.
ఆరుగురు పతివ్రతలు .. ఇప్పటి జనరేషన్‌కు ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు కానీ.. 90’s కిడ్స్ను అడిగితే రాజమౌళి కంటే గొప్పగా వివరిస్తారు. అసలు అప్పట్లో ఈ సినిమా చూడడానికి కుర్రాకారు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. లిటరల్‌గా రక్తాలు చిందించేవాళ్లు. ఇక ఇప్పటి తరానికి ఈ సినిమా ఒక మీమ్ మెటీరియల్ అయిపోయింది. ఈవీవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు దశాబ్దాల కిందట రిలీజైంది.
సినిమా వచ్చి దాదాపు 22 ఏళ్ళు అయింది. అయినా సరే ఈ సినిమా మీద ఇప్పటికీ అదే అటెన్షన్. అంతేకాదు అసలు ఈ సినిమా రిలీజైన టైమ్‌లో పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అయింది. అసలు ఈవీవీ నుంచి ఇలాంటి సినిమాను ఏ సినీ ప్రేక్షకుడు ఎక్స్‌పెక్ట్‌చేయలేదు. ఎంతో గొప్ప పేరున్న ఈవీవీ ఇలాంటి సినిమా తీశాడంటే ఎవ్వరూ కూడా నమ్మలేకపోయారు.
అంతలా ఈ సినిమా అప్పట్లో నెగిటివిటీ ఎదుర్కొంది. అయితే రాను రాను ఈ సినిమాకు యూత్‌లో కల్ట్ స్టేటస్ వచ్చింది. ఎంతలా అంటే.. అసలు ఏవేవో సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ చేయండి.. దెబ్బకి రూ.10 కోట్లు డే1 తీసుకొస్తాం అంటూ కుర్రాళ్లు కామెంట్స్ చేసేవాళ్లు. అంటే ఎంతలా ఈ సినిమా ఇంపాక్ట్ చూపించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

కాగా.. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్‌కు రెడీ అయింది. పోచమ్మ ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఈ సినిమా రీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను డిసెంబర్ 11న రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
E.V.V. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు కమలాకర్, జనార్ధన్, మహర్షి, నాగిరెడ్డి కీలక బాధ్యతలు నిర్వహించారు. పోచమ్మ ఫిల్మ్స్ రిలీజ్ ద్వారా ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. బోల్డ్ కామెడీ కంటెంట్‌తో అప్పట్లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రంలో అమృత, లహరి, చలపతి రావు, ఎల్.బి. శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భార్యాభర్తల మధ్య అనుబంధం, వివాహేతర సంబంధాలు, లైంగిక సమస్యలు, బలవంతపు పెళ్లిళ్లు, సైకో మనస్తత్వం కలిగిన భర్తల ప్రవర్తన వంటి విభిన్న అంశాలతో పాటు ప్రేమ, భావోద్వేగాలు, హాస్యాన్ని మేళవిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
దీపావళి సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై మరోసారి ఆసక్తిని పెంచుతోంది. డిసెంబర్ 11న థియేటర్లలో రీ-రిలీజ్ కానున్న ‘ఆరుగురు పతివ్రతలు’ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

