ప్రభన్యూస్

Thotakura Vepudu: ఆకుకూరలు తినని పిల్లలు కూడా.. తోటకూర వేపుడు ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు! | లైఫ్ స్టైల్


Last Updated:

తోటకూరను కాస్త కొత్తగా, రుచిగా తయారు చేసి పెడితే తప్పకుండా తింటారు. ముఖ్యంగా పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలా దినుసులతో చేసే ఆంధ్ర స్టైల్ తోటకూర వేపుడు ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీల్లోకి ఈ వేపుడు మంచి కాంబినేషన్. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.

News18
News18

ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో తోటకూరకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. అయితే కొంతమంది పిల్లలు, పెద్దలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. అలాంటివారికి తోటకూరను కాస్త కొత్తగా, రుచిగా తయారు చేసి పెడితే తప్పకుండా తింటారు. ముఖ్యంగా పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలా దినుసులతో చేసే ఆంధ్ర స్టైల్ తోటకూర వేపుడు ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీల్లోకి ఈ వేపుడు మంచి కాంబినేషన్. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఈ వేపుడు చేయడానికి ఐదు చిన్న తోటకూర కట్టలు, పావు కప్పు పచ్చిశనగపప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు, రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు, నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోవాలి. వీటితో పాటు తగినంత ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, ముప్పావు టీస్పూన్ కారం, ఒక టీస్పూన్ ధనియాల పొడి, పప్పు ఉడికించడానికి ముప్పావు కప్పు నీళ్లు సిద్ధం చేసుకోవాలి.

ముందుగా పచ్చిశనగపప్పును రెండు సార్లు శుభ్రంగా కడిగి చిన్న కుక్కర్‌లో వేయాలి. అందులో ముప్పావు కప్పు నీళ్లు పోసి మీడియం మంటపై సుమారు ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒకవేళ పప్పును ముందుగానే నానబెట్టుకుంటే రెండు విజిల్స్ సరిపోవచ్చు. అయితే పప్పు పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఉడికిన తర్వాత నీటిని వడకట్టి పప్పును పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు తోటకూర ఆకులను కాడల నుంచి వేరు చేసి, మట్టి, దుమ్ము లేకుండా నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి ఆకులను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా చిన్నగా తరిగితే వేపుడు త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి.

తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత తరిగిన తోటకూరను వేసి మీడియం మంటపై రెండు నిమిషాలు కలుపుతూ వేయించాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. తోటకూర నుంచి నీరు బయటకు వస్తుంది కాబట్టి మూత పెట్టకుండా వేయించాలి. నీరు పూర్తిగా ఆవిరైపోయే వరకు సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి.

చివరగా కారం, ధనియాల పొడి వేసి మరో నిమిషం పాటు తక్కువ మంటపై కలుపుకోవాలి. మసాలాలన్నీ తోటకూరకు బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ తోటకూర వేపుడు సిద్ధం. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ వేపుడు కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. చపాతీ, రోటీలతో కూడా తినవచ్చు. పచ్చిశనగపప్పు బదులుగా కందిపప్పును కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా ఒకసారి తయారు చేసి చూడండి.. ఆకుకూరలు ఇష్టపడని వారు కూడా మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 11:56 am Digital Edition : Prabhanews
Thotakura Vepudu: ఆకుకూరలు తినని పిల్లలు కూడా.. తోటకూర వేపుడు ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు! | లైఫ్ స్టైల్

Last Updated:Nov 07, 2026 11:47 AM ISTతోటకూరను కాస్త కొత్తగా, రుచిగా తయారు చేసి పెడితే తప్పకుండా తింటారు. ముఖ్యంగా పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలా దినుసులతో చేసే ఆంధ్ర స్టైల్ తోటకూర వేపుడు ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీల్లోకి ఈ వేపుడు మంచి కాంబినేషన్. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.News18ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో తోటకూరకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. అయితే కొంతమంది పిల్లలు, పెద్దలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. అలాంటివారికి తోటకూరను కాస్త కొత్తగా, రుచిగా తయారు చేసి పెడితే తప్పకుండా తింటారు. ముఖ్యంగా పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలా దినుసులతో చేసే ఆంధ్ర స్టైల్ తోటకూర వేపుడు ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీల్లోకి ఈ వేపుడు మంచి కాంబినేషన్. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.ఈ వేపుడు చేయడానికి ఐదు చిన్న తోటకూర కట్టలు, పావు కప్పు పచ్చిశనగపప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు, రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు, నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోవాలి. వీటితో పాటు తగినంత ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, ముప్పావు టీస్పూన్ కారం, ఒక టీస్పూన్ ధనియాల పొడి, పప్పు ఉడికించడానికి ముప్పావు కప్పు నీళ్లు సిద్ధం చేసుకోవాలి.ముందుగా పచ్చిశనగపప్పును రెండు సార్లు శుభ్రంగా కడిగి చిన్న కుక్కర్‌లో వేయాలి. అందులో ముప్పావు కప్పు నీళ్లు పోసి మీడియం మంటపై సుమారు ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒకవేళ పప్పును ముందుగానే నానబెట్టుకుంటే రెండు విజిల్స్ సరిపోవచ్చు. అయితే పప్పు పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఉడికిన తర్వాత నీటిని వడకట్టి పప్పును పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు తోటకూర ఆకులను కాడల నుంచి వేరు చేసి, మట్టి, దుమ్ము లేకుండా నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి ఆకులను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా చిన్నగా తరిగితే వేపుడు త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి.తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత తరిగిన తోటకూరను వేసి మీడియం మంటపై రెండు నిమిషాలు కలుపుతూ వేయించాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. తోటకూర నుంచి నీరు బయటకు వస్తుంది కాబట్టి మూత పెట్టకుండా వేయించాలి. నీరు పూర్తిగా ఆవిరైపోయే వరకు సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి.చివరగా కారం, ధనియాల పొడి వేసి మరో నిమిషం పాటు తక్కువ మంటపై కలుపుకోవాలి. మసాలాలన్నీ తోటకూరకు బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ తోటకూర వేపుడు సిద్ధం. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ వేపుడు కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. చపాతీ, రోటీలతో కూడా తినవచ్చు. పచ్చిశనగపప్పు బదులుగా కందిపప్పును కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా ఒకసారి తయారు చేసి చూడండి.. ఆకుకూరలు ఇష్టపడని వారు కూడా మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు!మరింత చదవండి

Source link