ప్రభన్యూస్

Teja Sajja with CM RevanthReddy: సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక.. తేజ సజ్జా పెళ్లి ఎప్పుడు? ఎక్కడో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

హనుమాన్ ఫేమ్ టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. మరి ఆయన పెళ్లి ఎప్పుడు? ఎక్కడో తెలుసుకుందామా?

News18
News18

హనుమాన్ ఫేమ్ టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కెరీర్ పరంగా అత్యుత్తమ దశలో ఉన్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి తన వ్యక్తిగత జీవితంలోనూ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులు ఎంపిక చేసిన అమ్మాయితో ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది. త్వరలో జరగనున్న తన నిశ్చితార్థ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులను ఆయన స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తన నిశ్చితార్థ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ శుభకార్యానికి విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించాలని సీఎంని కోరారు తేజ సజ్జా. తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్ నవంబర్ రెండో వారంలో, అలాగే వివాహ మహోత్సవం డిసెంబర్ నెలలో అత్యంత వైభవంగా జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ప్రముఖ చారిత్రక, పర్యాటక నగరమైన ఉదయ్‌పుర్‌ను తమ డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికగా ఎంచుకున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో ఈ వివాహ వేడుకను చాలా ప్రైవేట్‌గా, సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. ఉదయ్‌పుర్ పెళ్లి అనంతరం టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, మిత్రుల కోసం హైదరాబాద్‌లో ఓ భారీ రిసెప్షన్ వేడుకను ఘనంగా ప్లాన్ చేస్తున్నారు.

‘చూడాలని ఉంది’, ‘ఇంద్ర’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో బాలనటుడిగా అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన తేజ.. ‘జాంబీ రెడ్డి’తో హీరోగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హనుమాన్ సినిమాతో టాలీవుడ్ లో తన మార్క్ చూపించారు.

కాగా, ఈ ఏడాది చివర్లో టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి గట్టిగానే నెలకొంది. అక్కినేని నాగ చైతన్య, సాయి దుర్గ తేజ్, కాలభైరవ వంటి యంగ్ స్టార్లు వరుసగా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, ఇప్పుడు ఆ జాబితాలో తేజ సజ్జా కూడా చేరడంతో పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 10:35 am Digital Edition : Prabhanews
Teja Sajja with CM RevanthReddy: సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక.. తేజ సజ్జా పెళ్లి ఎప్పుడు? ఎక్కడో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 07, 2026 10:32 AM ISTహనుమాన్ ఫేమ్ టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. మరి ఆయన పెళ్లి ఎప్పుడు? ఎక్కడో తెలుసుకుందామా? News18హనుమాన్ ఫేమ్ టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కెరీర్ పరంగా అత్యుత్తమ దశలో ఉన్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి తన వ్యక్తిగత జీవితంలోనూ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులు ఎంపిక చేసిన అమ్మాయితో ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది. త్వరలో జరగనున్న తన నిశ్చితార్థ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులను ఆయన స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తన నిశ్చితార్థ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ శుభకార్యానికి విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించాలని సీఎంని కోరారు తేజ సజ్జా. తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్ నవంబర్ రెండో వారంలో, అలాగే వివాహ మహోత్సవం డిసెంబర్ నెలలో అత్యంత వైభవంగా జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ప్రముఖ చారిత్రక, పర్యాటక నగరమైన ఉదయ్‌పుర్‌ను తమ డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికగా ఎంచుకున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో ఈ వివాహ వేడుకను చాలా ప్రైవేట్‌గా, సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. ఉదయ్‌పుర్ పెళ్లి అనంతరం టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, మిత్రుల కోసం హైదరాబాద్‌లో ఓ భారీ రిసెప్షన్ వేడుకను ఘనంగా ప్లాన్ చేస్తున్నారు.'చూడాలని ఉంది', 'ఇంద్ర' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో బాలనటుడిగా అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన తేజ.. 'జాంబీ రెడ్డి'తో హీరోగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హనుమాన్ సినిమాతో టాలీవుడ్ లో తన మార్క్ చూపించారు.కాగా, ఈ ఏడాది చివర్లో టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి గట్టిగానే నెలకొంది. అక్కినేని నాగ చైతన్య, సాయి దుర్గ తేజ్, కాలభైరవ వంటి యంగ్ స్టార్లు వరుసగా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, ఇప్పుడు ఆ జాబితాలో తేజ సజ్జా కూడా చేరడంతో పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొంది.మరింత చదవండి

Source link