ప్రభన్యూస్

Eetha: స్టేజి వెనుక ప్రసవం, నిమిషాల్లోనే మళ్ళీ వేదిక పైకి..! ఇంతకీ ఎవరీ విఠాబాయి | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘ఈథా’ అనే బయోగ్రాఫికల్‌ డ్రామా రాబోతోంది. ఇందులో విఠాబాయి నారాయణ్‌ గావ్‌కర్‌ పాత్రను శ్రద్ధా కపూర్‌ పోషిస్తోంది. మరి ఎవరీ విఠాబాయి, ఆమె జీవితంలోని కీలక ఘట్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

News18
News18

ఈ మధ్యకాలంలో బయోపిక్స్ హవా పెరిగిపోయింది. అయితే నిజ జీవిత కథల్లో లీడ్ రోల్స్ పోషించడం ఎంతో సవాలుతో కూడుకున్న పని. అలాంటి సవాలు ఇప్పుడు బాలీవుడ్‌ అందాల నటి శ్రద్ధా కపూర్‌కు ఎదురైంది. ఆమె ‘ఈథా’ అనే బయోగ్రాఫికల్‌ డ్రామా చేస్తోంది. ఇందులో విఠాబాయి నారాయణ్‌ గావ్‌కర్‌ పాత్రను శ్రద్ధా కపూర్‌ పోషిస్తోంది. ఇప్పటికే చేపట్టిన ప్రమోషన్స్ సినిమాపై అంచనాలు నెలకొల్పాయి. డిసెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో విఠాబాయికి సంబంధించిన కీలక విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావణీ, తమాషా జానపద కళాకారిణి విఠాబాయి నారాయణంగావ్‌కర్. చిన్న వయసులోనే నాటకరంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. తమాషా, లావణి కళాకారిణిగా తన గానం, నృత్యంతో అందరినీ ఆకట్టుకుంది. మరాఠీ జానపదకళలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తిగా నిలవడమే గాక రెండుసార్లు రాష్ట్రపతి పురస్కారాలను అందుకుంది. అయితే విఠాబాయి జీవితంలో ఓ పట్టుదల, దాని వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయట. ఇప్పుడు వాటన్నింటినీ వెండితెరపై చూడబోతున్నాం.

‘ఈత’ చిత్రంలో శ్రద్ధా కపూర్ ఆమె పాత్రలో అడుగుపెట్టడంతో, విఠాబాయి అసాధారణ ప్రయాణంపై మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. ఆమెది ఒక అద్భుతమైన నిజ జీవిత కథ అంటున్నారు కొందరు. విఠాబాయి తాత, నారాయణ్ ఖుడే, ఒక సంచార తమాషా బృందాన్ని స్థాపించారు. ఆ వారసత్వాన్ని తదనంతరం ఆమె తండ్రి, భావు బాపు నారాయణ్‌గావ్‌కర్, ఇతర కుటుంబ సభ్యులు ‘భావు-బాపు మాంగ్’ పేరుతో ముందుకు తీసుకువెళ్లారు. ఆ కుటుంబం మహారాష్ట్ర అంతటా పర్యటిస్తూ, తమ ప్రదర్శనలను ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తీసుకువెళ్ళింది.

విఠాబాయికి ప్రదర్శన కళలలో విద్య ప్రయాణాలలోనే లభించింది. ఆ సంచార బృందమే ఆమె తరగతి గది, అనుభవజ్ఞులైన ప్రదర్శకులు వేదికపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడాన్ని చూడటం ద్వారా ఆమె పాఠాలు నేర్చుకుంది. లావణి, గావ్లాన్, ఇతర జానపద ప్రదర్శన సంప్రదాయాల లయలను ఆకళింపు చేసుకుంటూ ఆమె పెరిగింది. క్రమంగా కఠినమైన తమాషా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

స్టేజి వెనుక ప్రసవం – నిజ జీవిత సంఘటన: వితాబాయి జీవితంలో జరిగిన అత్యంత అద్భుతమైన, కళ్లు చెమర్చే నిజమైన సంఘటనను ఈ సినిమా టీజర్ & ట్రైలర్‌లో చూపించారు. వితాబాయి 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా స్టేజీపై ప్రదర్శన ఇస్తూనే ఉన్నారు. ఒక ప్రదర్శన మధ్యలో ఆమెకు అకస్మాత్తుగా ప్రసవ వేదన (పెయిన్స్) మొదలయ్యాయి. దాంతో ఆమె ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా స్టేజీ వెనుకకు (బ్యాక్‌స్టేజ్) వెళ్లి, ఎటువంటి వైద్య సహాయం లేకుండానే స్వయంగా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టిన కొద్ది నిమిషాలకే, బొడ్డు తాడును ఒక రాయితో కోసేసి, ఒంటిపై రక్తాన్ని తుడుచుకుని ఆమె మళ్లీ స్టేజీపైకి వచ్చి తన నృత్యాన్ని కొనసాగించారు. కళ పట్ల ఆమెకున్న అంకితభావానికి, గుండె ధైర్యానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది.

లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ బయోపిక్ లో శ్రద్ధా కపూర్ గర్భవతిగా ఉన్న లావణీ నృత్యకారిణి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారని ఇప్పటికే విడుదలైన వీడియోస్ ద్వారా తెలుస్తోంది. ఈ ‘ఈథా’ చిత్రం డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 5:15 pm Digital Edition : Prabhanews
Eetha: స్టేజి వెనుక ప్రసవం, నిమిషాల్లోనే మళ్ళీ వేదిక పైకి..! ఇంతకీ ఎవరీ విఠాబాయి | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 05, 2026 4:21 PM IST‘ఈథా’ అనే బయోగ్రాఫికల్‌ డ్రామా రాబోతోంది. ఇందులో విఠాబాయి నారాయణ్‌ గావ్‌కర్‌ పాత్రను శ్రద్ధా కపూర్‌ పోషిస్తోంది. మరి ఎవరీ విఠాబాయి, ఆమె జీవితంలోని కీలక ఘట్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
News18ఈ మధ్యకాలంలో బయోపిక్స్ హవా పెరిగిపోయింది. అయితే నిజ జీవిత కథల్లో లీడ్ రోల్స్ పోషించడం ఎంతో సవాలుతో కూడుకున్న పని. అలాంటి సవాలు ఇప్పుడు బాలీవుడ్‌ అందాల నటి శ్రద్ధా కపూర్‌కు ఎదురైంది. ఆమె ‘ఈథా’ అనే బయోగ్రాఫికల్‌ డ్రామా చేస్తోంది. ఇందులో విఠాబాయి నారాయణ్‌ గావ్‌కర్‌ పాత్రను శ్రద్ధా కపూర్‌ పోషిస్తోంది. ఇప్పటికే చేపట్టిన ప్రమోషన్స్ సినిమాపై అంచనాలు నెలకొల్పాయి. డిసెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో విఠాబాయికి సంబంధించిన కీలక విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావణీ, తమాషా జానపద కళాకారిణి విఠాబాయి నారాయణంగావ్‌కర్. చిన్న వయసులోనే నాటకరంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. తమాషా, లావణి కళాకారిణిగా తన గానం, నృత్యంతో అందరినీ ఆకట్టుకుంది. మరాఠీ జానపదకళలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తిగా నిలవడమే గాక రెండుసార్లు రాష్ట్రపతి పురస్కారాలను అందుకుంది. అయితే విఠాబాయి జీవితంలో ఓ పట్టుదల, దాని వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయట. ఇప్పుడు వాటన్నింటినీ వెండితెరపై చూడబోతున్నాం.'ఈత' చిత్రంలో శ్రద్ధా కపూర్ ఆమె పాత్రలో అడుగుపెట్టడంతో, విఠాబాయి అసాధారణ ప్రయాణంపై మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. ఆమెది ఒక అద్భుతమైన నిజ జీవిత కథ అంటున్నారు కొందరు. విఠాబాయి తాత, నారాయణ్ ఖుడే, ఒక సంచార తమాషా బృందాన్ని స్థాపించారు. ఆ వారసత్వాన్ని తదనంతరం ఆమె తండ్రి, భావు బాపు నారాయణ్‌గావ్‌కర్, ఇతర కుటుంబ సభ్యులు 'భావు-బాపు మాంగ్' పేరుతో ముందుకు తీసుకువెళ్లారు. ఆ కుటుంబం మహారాష్ట్ర అంతటా పర్యటిస్తూ, తమ ప్రదర్శనలను ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తీసుకువెళ్ళింది.విఠాబాయికి ప్రదర్శన కళలలో విద్య ప్రయాణాలలోనే లభించింది. ఆ సంచార బృందమే ఆమె తరగతి గది, అనుభవజ్ఞులైన ప్రదర్శకులు వేదికపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడాన్ని చూడటం ద్వారా ఆమె పాఠాలు నేర్చుకుంది. లావణి, గావ్లాన్, ఇతర జానపద ప్రదర్శన సంప్రదాయాల లయలను ఆకళింపు చేసుకుంటూ ఆమె పెరిగింది. క్రమంగా కఠినమైన తమాషా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.స్టేజి వెనుక ప్రసవం - నిజ జీవిత సంఘటన: వితాబాయి జీవితంలో జరిగిన అత్యంత అద్భుతమైన, కళ్లు చెమర్చే నిజమైన సంఘటనను ఈ సినిమా టీజర్ & ట్రైలర్‌లో చూపించారు. వితాబాయి 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా స్టేజీపై ప్రదర్శన ఇస్తూనే ఉన్నారు. ఒక ప్రదర్శన మధ్యలో ఆమెకు అకస్మాత్తుగా ప్రసవ వేదన (పెయిన్స్) మొదలయ్యాయి. దాంతో ఆమె ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా స్టేజీ వెనుకకు (బ్యాక్‌స్టేజ్) వెళ్లి, ఎటువంటి వైద్య సహాయం లేకుండానే స్వయంగా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టిన కొద్ది నిమిషాలకే, బొడ్డు తాడును ఒక రాయితో కోసేసి, ఒంటిపై రక్తాన్ని తుడుచుకుని ఆమె మళ్లీ స్టేజీపైకి వచ్చి తన నృత్యాన్ని కొనసాగించారు. కళ పట్ల ఆమెకున్న అంకితభావానికి, గుండె ధైర్యానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది.లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ బయోపిక్ లో శ్రద్ధా కపూర్ గర్భవతిగా ఉన్న లావణీ నృత్యకారిణి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారని ఇప్పటికే విడుదలైన వీడియోస్ ద్వారా తెలుస్తోంది. ఈ ‘ఈథా’ చిత్రం డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానుంది.మరింత చదవండి

Source link