ప్రభన్యూస్

Donald Trump: రెండేళ్ల లోనే ట్రంప్‌పై ఇంత వ్యతిరేకత ఎందుకు? ఆ ఒక్క తప్పే ఈ ఘోర పరాజయానికి కారణమా? |


Last Updated:

అమెరికా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు మధ్యంతర ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల ఫలితాల వెనుక ఉన్న కీలక కారణాలు, భారత్‌పై పడే ప్రభావం ఏమిటో తెలుసుకుందాం.

News18
News18

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి గట్టి పరాజయం ఎదురైంది. ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ డెమోక్రటిక్ పార్టీ ఆధిక్యం సాధించడంతో కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల నియంత్రణ ముగిసింది. ఈ ఫలితాల వెనుక ఇరాన్ యుద్ధం, పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ట్రంప్ కుటుంబ వ్యాపార ప్రయోజనాలపై వచ్చిన విమర్శలు ప్రధాన చర్చనీయాంశాలుగా నిలిచాయి. రెండేళ్ల క్రితం రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఇంత త్వరగా రాజకీయంగా ఎదురుదెబ్బ తగలడానికి కారణాలేమిటి?

ఇరాన్ యుద్ధమే ప్రధాన కారణమా?

2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి అమెరికాను విదేశీ యుద్ధాలకు దూరంగా ఉంచడం. ఇతర దేశాల వివాదాల్లో జోక్యం చేసుకోకుండా, అమెరికా ప్రజలు, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఈ విధానాన్నే ‘అమెరికా ఫస్ట్’గా ప్రచారం చేశారు. అయితే ఇరాన్‌తో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగడం ఆయన రాజకీయ సందేశానికి విరుద్ధంగా మారింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే స్పష్టత లేకపోవడం, సైనిక చర్యల విషయంలో ట్రంప్ చేసిన భిన్న ప్రకటనలు ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తించాయి. ఈ యుద్ధం తమ పార్టీ ఓటమికి ఒక కారణమని ట్రంప్ కూడా అంగీకరించారు. అయితే సైనిక చర్యను మాత్రం సమర్థించుకున్నారు.

పెరిగిన ఇంధన ధరలు.. సామాన్యులపై భారం

ఇరాన్ యుద్ధం ప్రభావం అమెరికా ఇంధన మార్కెట్‌పైనా పడింది. పెట్రోల్ ధరలు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ఖర్చులు కూడా అధికమయ్యాయని డెమోక్రాట్లు ప్రచారం చేశారు. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు యుద్ధం అదనపు భారంగా మారిందని వివరించారు. మరోవైపు ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు కూడా వస్తువుల ధరలు పెరగడానికి కారణమయ్యాయన్న విమర్శలు వినిపించాయి. ప్రజల జీవన వ్యయం ఎన్నికల్లో కీలక అంశంగా మారిందని ఓటర్ల సర్వేలు సూచించాయి.

ట్రంప్ కుటుంబ వ్యాపారాలపై విమర్శలు

ఈ ఎన్నికల ప్రచారంలో అవినీతి ఆరోపణలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల వ్యాపార ప్రయోజనాలపై డెమోక్రటిక్ పార్టీ ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా క్రిప్టోకరెన్సీ వ్యాపారాలతో ముడిపడిన ఆర్థిక ప్రయోజనాలను ప్రస్తావించింది. సాధారణ కుటుంబాలు ధరల పెరుగుదలతో సతమతమవుతుంటే, అధ్యక్షుడి కుటుంబ వ్యాపారాల గురించి ఎందుకు ఎక్కువ చర్చ జరుగుతోందని విమర్శించింది. ఈ అంశాలు ఓటర్లలో చర్చకు దారితీశాయని ఎన్నికల విశ్లేషణలు పేర్కొన్నాయి.

భారత్‌పై ఎలాంటి ప్రభావం?

అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రాట్లకు ఆధిక్యం రావడం భారత్‌కూ కీలక పరిణామమే. భారతీయ వస్తువులపై సుంకాలు, వాణిజ్య ఒప్పందాలు, హెచ్‌1బీ వీసా నిబంధనలపై ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలను ఇకపై కాంగ్రెస్ మరింతగా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే దీనివల్ల సుంకాలు లేదా వీసా విధానాలు వెంటనే మారిపోతాయని చెప్పలేం. వాణిజ్యం, విదేశాంగ విధానాలపై ట్రంప్‌కు ఇంకా కార్యనిర్వాహక అధికారాలు ఉన్నాయి.

ఇక ఇరాన్ యుద్ధం, ఆర్థిక భారం, అవినీతి ఆరోపణలు రిపబ్లికన్ల ఓటమికి దోహదపడిన ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి. 2028 అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు ట్రంప్‌తో పాటు రిపబ్లికన్ పార్టీకి రాజకీయ సవాలుగా మారాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 10:49 am Digital Edition : Prabhanews
Donald Trump: రెండేళ్ల లోనే ట్రంప్‌పై ఇంత వ్యతిరేకత ఎందుకు? ఆ ఒక్క తప్పే ఈ ఘోర పరాజయానికి కారణమా? |

Last Updated:Nov 05, 2026 10:37 AM ISTఅమెరికా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు మధ్యంతర ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల ఫలితాల వెనుక ఉన్న కీలక కారణాలు, భారత్‌పై పడే ప్రభావం ఏమిటో తెలుసుకుందాం.
News18అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి గట్టి పరాజయం ఎదురైంది. ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ డెమోక్రటిక్ పార్టీ ఆధిక్యం సాధించడంతో కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల నియంత్రణ ముగిసింది. ఈ ఫలితాల వెనుక ఇరాన్ యుద్ధం, పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ట్రంప్ కుటుంబ వ్యాపార ప్రయోజనాలపై వచ్చిన విమర్శలు ప్రధాన చర్చనీయాంశాలుగా నిలిచాయి. రెండేళ్ల క్రితం రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఇంత త్వరగా రాజకీయంగా ఎదురుదెబ్బ తగలడానికి కారణాలేమిటి?ఇరాన్ యుద్ధమే ప్రధాన కారణమా?2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి అమెరికాను విదేశీ యుద్ధాలకు దూరంగా ఉంచడం. ఇతర దేశాల వివాదాల్లో జోక్యం చేసుకోకుండా, అమెరికా ప్రజలు, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఈ విధానాన్నే ‘అమెరికా ఫస్ట్’గా ప్రచారం చేశారు. అయితే ఇరాన్‌తో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగడం ఆయన రాజకీయ సందేశానికి విరుద్ధంగా మారింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే స్పష్టత లేకపోవడం, సైనిక చర్యల విషయంలో ట్రంప్ చేసిన భిన్న ప్రకటనలు ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తించాయి. ఈ యుద్ధం తమ పార్టీ ఓటమికి ఒక కారణమని ట్రంప్ కూడా అంగీకరించారు. అయితే సైనిక చర్యను మాత్రం సమర్థించుకున్నారు.పెరిగిన ఇంధన ధరలు.. సామాన్యులపై భారంఇరాన్ యుద్ధం ప్రభావం అమెరికా ఇంధన మార్కెట్‌పైనా పడింది. పెట్రోల్ ధరలు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ఖర్చులు కూడా అధికమయ్యాయని డెమోక్రాట్లు ప్రచారం చేశారు. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు యుద్ధం అదనపు భారంగా మారిందని వివరించారు. మరోవైపు ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు కూడా వస్తువుల ధరలు పెరగడానికి కారణమయ్యాయన్న విమర్శలు వినిపించాయి. ప్రజల జీవన వ్యయం ఎన్నికల్లో కీలక అంశంగా మారిందని ఓటర్ల సర్వేలు సూచించాయి.ట్రంప్ కుటుంబ వ్యాపారాలపై విమర్శలుఈ ఎన్నికల ప్రచారంలో అవినీతి ఆరోపణలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల వ్యాపార ప్రయోజనాలపై డెమోక్రటిక్ పార్టీ ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా క్రిప్టోకరెన్సీ వ్యాపారాలతో ముడిపడిన ఆర్థిక ప్రయోజనాలను ప్రస్తావించింది. సాధారణ కుటుంబాలు ధరల పెరుగుదలతో సతమతమవుతుంటే, అధ్యక్షుడి కుటుంబ వ్యాపారాల గురించి ఎందుకు ఎక్కువ చర్చ జరుగుతోందని విమర్శించింది. ఈ అంశాలు ఓటర్లలో చర్చకు దారితీశాయని ఎన్నికల విశ్లేషణలు పేర్కొన్నాయి.భారత్‌పై ఎలాంటి ప్రభావం?అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రాట్లకు ఆధిక్యం రావడం భారత్‌కూ కీలక పరిణామమే. భారతీయ వస్తువులపై సుంకాలు, వాణిజ్య ఒప్పందాలు, హెచ్‌1బీ వీసా నిబంధనలపై ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలను ఇకపై కాంగ్రెస్ మరింతగా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే దీనివల్ల సుంకాలు లేదా వీసా విధానాలు వెంటనే మారిపోతాయని చెప్పలేం. వాణిజ్యం, విదేశాంగ విధానాలపై ట్రంప్‌కు ఇంకా కార్యనిర్వాహక అధికారాలు ఉన్నాయి.ఇక ఇరాన్ యుద్ధం, ఆర్థిక భారం, అవినీతి ఆరోపణలు రిపబ్లికన్ల ఓటమికి దోహదపడిన ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి. 2028 అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు ట్రంప్‌తో పాటు రిపబ్లికన్ పార్టీకి రాజకీయ సవాలుగా మారాయి.మరింత చదవండి

Source link