తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయం, ఆంధ్రప్రదేశ్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దేశంలో అత్యంత సంపన్నమైన ఆలయ ట్రస్టుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని ఆస్తుల విలువ సుమారు రూ.2.26 లక్షల కోట్లుగా అంచనా. టీటీడీ తాజా వైట్ పేపర్ ప్రకారం, ఈ ఆస్తుల్లో బంగారం నిల్వలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, భూములు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. ఈ ట్రస్ట్‌కు ప్రతి ఏడాది రూ.5,100 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. భక్తులు సమర్పించే విరాళాల ద్వారా ఏడాదికి దాదాపు రూ.1,500 కోట్లు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)

