వైరల్ అవుతున్న చిత్రాల్లో సమంత సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ, కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బేబీ షవర్ వేడుకలో పాల్గొన్నట్లు కనిపించింది. పూలతో అలంకరించిన వేదిక, ప్రత్యేకమైన డెకరేషన్, సమంత ముఖంలో కనిపించిన ఆనందం అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫొటోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

