ఇప్పటికే విడుదలైన రామాయణ టీజర్, ట్రైలర్ ఆడియన్స్ అంచనాలకు రెక్కలు కట్టగా.. తాజాగా ముంబై స్క్రీనింగ్ తర్వాత బయటకొచ్చిన టాక్ అయితే భారీ హైప్ తీసుకొస్తోంది. ఈ స్క్రీనింగ్‌కు హాజరైన కంటెంట్ క్రియేటర్ ఆశిష్ చంచ్లానీ, ఈ చిత్రంలోని ఉత్కంఠభరితమైన విజువల్స్, కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, ప్రధాన తారాగణం యొక్క బలమైన నటనను ప్రశంసిస్తూ, ఇది చారిత్రాత్మక బ్లాక్‌బస్టర్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

