ప్రభన్యూస్

PM Modi: బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం.. గేమ్ ఛేంజర్ అన్న ప్రధాని మోదీ! |


Last Updated:

బెంగళూరు-ముంబై మధ్య ప్రతిష్టాత్మక వందే భారత్ స్లీపర్ రైలును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ప్రయాణ సమయాన్ని 16 గంటలకు తగ్గించే ఈ రైలు ప్రయాణికులకు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ప్రధాని మోదీ ప్రశంసించారు.

News18
News18

బెంగళూరు, ముంబై నగరాల మధ్య సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త రైలు సర్వీసుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన నగరాల మధ్య ఈ రైలు ప్రయాణం ఒక గేమ్ ఛేంజర్ అని ఆయన అభివర్ణించారు.

ఈ సర్వీసు ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, యువతకు అత్యంత వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సదుపాయం లభిస్తుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సాధారణంగా ఈ మార్గంలో ఇతర రైళ్లకు 22 గంటలకు పైగా సమయం పడుతుండగా, వందే భారత్ కేవలం 16 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుస్తుంది.

నవంబర్ 2 నుంచి రెగ్యులర్ సర్వీసులు..

ఈ రైలు రెగ్యులర్ సర్వీసులు నవంబర్ 2న ముంబై నుంచి, నవంబర్ 3న బెంగళూరు నుంచి ప్రారంభం కానున్నాయి. వారానికి ఆరు రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు నుంచి సోమవారం, ముంబై నుంచి మంగళవారం రైలు రాకపోకలు ఉండవు.

రైలు నంబర్ 27652 బెంగళూరులో రాత్రి 7:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు ముంబై సీఎస్‌ఎంటీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 27651 ముంబైలో రాత్రి 8:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.

మొత్తం 16 అత్యాధునిక కోచ్‌లతో రూపొందించిన ఈ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ బెర్తులు ఉన్నాయి. మార్గమధ్యంలో అనంతపురం, గుంతకల్, రాయచూర్, యాద్గిర్, కలబురగి, సోలాపూర్, పూణే, కళ్యాణ్ స్టేషన్లలో హాల్టింగ్‌లు కల్పించారు. ఐటీ హబ్ బెంగళూరు, ఆర్థిక రాజధాని ముంబై మధ్య ఈ నైట్ జర్నీ ప్రయాణికులకు గొప్ప ఊరటనివ్వనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 November 2026, 10:08 pm Digital Edition : Prabhanews
PM Modi: బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం.. గేమ్ ఛేంజర్ అన్న ప్రధాని మోదీ! |

Last Updated:Nov 01, 2026 10:03 PM ISTబెంగళూరు-ముంబై మధ్య ప్రతిష్టాత్మక వందే భారత్ స్లీపర్ రైలును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ప్రయాణ సమయాన్ని 16 గంటలకు తగ్గించే ఈ రైలు ప్రయాణికులకు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ప్రధాని మోదీ ప్రశంసించారు.News18బెంగళూరు, ముంబై నగరాల మధ్య సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త రైలు సర్వీసుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన నగరాల మధ్య ఈ రైలు ప్రయాణం ఒక గేమ్ ఛేంజర్ అని ఆయన అభివర్ణించారు.ఈ సర్వీసు ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, యువతకు అత్యంత వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సదుపాయం లభిస్తుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సాధారణంగా ఈ మార్గంలో ఇతర రైళ్లకు 22 గంటలకు పైగా సమయం పడుతుండగా, వందే భారత్ కేవలం 16 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుస్తుంది.నవంబర్ 2 నుంచి రెగ్యులర్ సర్వీసులు..ఈ రైలు రెగ్యులర్ సర్వీసులు నవంబర్ 2న ముంబై నుంచి, నవంబర్ 3న బెంగళూరు నుంచి ప్రారంభం కానున్నాయి. వారానికి ఆరు రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు నుంచి సోమవారం, ముంబై నుంచి మంగళవారం రైలు రాకపోకలు ఉండవు.
Another step towards better rail connectivity and that too from Bengaluru, the city of technology and innovation!
The Vande Bharat Sleeper Train will be a game changer for connectivity between Bengaluru and Mumbai.This train will benefit Karnataka, Andhra Pradesh and Maharashtra, especially benefitting youngsters, IT professionals and students.— Narendra Modi (@narendramodi) November 1, 2026రైలు నంబర్ 27652 బెంగళూరులో రాత్రి 7:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు ముంబై సీఎస్‌ఎంటీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 27651 ముంబైలో రాత్రి 8:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.మొత్తం 16 అత్యాధునిక కోచ్‌లతో రూపొందించిన ఈ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ బెర్తులు ఉన్నాయి. మార్గమధ్యంలో అనంతపురం, గుంతకల్, రాయచూర్, యాద్గిర్, కలబురగి, సోలాపూర్, పూణే, కళ్యాణ్ స్టేషన్లలో హాల్టింగ్‌లు కల్పించారు. ఐటీ హబ్ బెంగళూరు, ఆర్థిక రాజధాని ముంబై మధ్య ఈ నైట్ జర్నీ ప్రయాణికులకు గొప్ప ఊరటనివ్వనుంది.మరింత చదవండి

Source link