ఇక ముద్రగడ మరణించి ఒక రోజు గడిచినా ఆయన నివాసం వద్దకు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానుల రాక కొనసాగుతోంది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన సమాధి వద్ద పలువురు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అదే సమయంలో రాజమండ్రిలో ఉన్న కుమార్తె క్రాంతిని కూడా పలువురు జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు కలిసి ఓదారుస్తున్నారు. ముద్రగడ పద్మనాభం మరణంతో ఒక రాజకీయ అధ్యాయం ముగిసిందనే భావన వ్యక్తమవుతుండగా, ఆయన కుటుంబానికి సంబంధించిన ఈ పరిణామాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి.

