ప్రభన్యూస్

PM Modi: 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతే మన లక్ష్యమన్న ప్రధాని.. సాధన కోసం అందరూ ఏకం కావాలని మోదీ పిలుపు |


Last Updated:

PM Modi: 2047వ సంవత్సరం నాటికి ‘వికసిత భారతం’ (Developed India)ను నిర్మించే లక్ష్యంలో భాగస్వాములు కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి పౌరుడికి పిలుపునిచ్చారు. ‘వికసిత భారతం’ సాకారం కావాలంటే సామాజిక ఐక్యత, స్వయం సమృద్ధి స్ఫూర్తి, యువత చురుకైన భాగస్వామ్యం, భారతీయ సాంస్కృతిక విలువలపై అవగాహన ఎంతో అవసరమని ఆయన నొక్కి చెప్పారు.

News18
News18

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాజాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. స్వయం సమృద్ధిని ప్రోత్సహించాలని కోరడంతో పాటుగా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం)ను నిర్మించే లక్ష్యంలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో చిన్మయ మిషన్ నిర్వహించిన ‘చిన్మయ అమృత మహోత్సవ గ్లోబల్ కాన్ఫరెన్స్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రధాని దేశాభివృద్ధిని , జాతీయ గౌరవాన్ని పెంపొందించడంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తన ప్రసంగం ద్వారా పేర్కొన్నారు.

అందరూ ఏకం కావాలి: ప్రధాని మోదీ

సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పౌరులలో స్వయం సమృద్ధిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న మోదీ.. అభివృద్ధి చెందిన భారతావనిని నిర్మించే సంకల్పంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలన్నారు. వివిధ సంస్థలకు వేర్వేరు లక్ష్యాలు ఉండవచ్చునని.. అయితే దేశాభివృద్ధి, జాతీయ గౌరవం మాత్రం అందరికీ ఉమ్మడి లక్ష్యాలేనని ప్రధాని స్పష్టం చేశారు.

‘యువత ఎప్పుడూ నా ప్రాధాన్యతే’

ప్రభుత్వ అధినేతగా తన 25 ఏళ్ల పదవీకాలంలో యువత ఎల్లప్పుడూ తన ప్రయత్నాలు, విధానాల కేంద్రబిందువుగా ఉన్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘చిన్మయ అమృత మహోత్సవం’తో అనుసంధానమైన యువ స్వచ్ఛంద సేవకులను ఆయన అభినందించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ యువ స్వచ్ఛంద సేవకులు సుమారు 300 రోజుల వ్యవధిలో దాదాపు 40,000 కిలోమీటర్లు ప్రయాణించి, లక్ష మందికి పైగా యువతను చేరుకున్నారు.

స్వామి చిన్మయానంద సేవలు గుర్తింపు..

స్వామి చిన్మయానంద అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన ఆధ్యాత్మిక పురోగతిని వ్యక్తిగత వికాసంతో , జాతీయ పురోగతితో అనుసంధానించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ‘గీతా జ్ఞాన యజ్ఞం’ వంటి కార్యక్రమాల ద్వారా అలాగే ఉపనిషత్తులు , వేదాంతాలకు సంబంధించిన జ్ఞానాన్ని సామాన్య ప్రజలకు చేరవేసే ప్రయత్నాల ద్వారా ఆయన భారతీయ సంస్కృతి పట్ల గర్వభావనను బలోపేతం చేశారు.

భారతదేశ సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణకు ప్రాధాన్యత..

సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ గురించి చర్చిస్తున్నప్పుడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మాణానికి ఏకనాథ్ రనడే చేసిన కృషిని ప్రధానమంత్రి మోదీ గుర్తుచేసుకున్నారు. స్వామి చిన్మయానంద ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడమే కాకుండా ఈ ప్రాజెక్టు కోసం మొట్టమొదటి ఆర్థిక విరాళాన్ని కూడా అందించారని మోదీ పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ ధామ్, అయోధ్యలోని రామమందిరం, ఉజ్జయినిలోని మహాకాల్ మహలోక్, అలాగే కేదార్‌నాథ్ , బద్రీనాథ్‌లలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాలకు పునరుజ్జీవం కల్పిస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

పౌరుల బాధ్యత ఇది..

ప్రధానమంత్రి అందించిన ప్రధాన సందేశం ఏమిటంటే అభివృద్ధి చెందిన భారతావనిని నిర్మించడం కేవలం ప్రభుత్వ ప్రయత్నాలతోనే సాధ్యం కాదు. దీనికి సామాజిక ఐక్యత, స్వయం సమృద్ధి స్ఫూర్తి, యువత క్రియాశీల భాగస్వామ్యం, భారతీయ సాంస్కృతిక విలువలపై అవగాహన అవసరం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 October 2026, 5:41 pm Digital Edition : Prabhanews
PM Modi: 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతే మన లక్ష్యమన్న ప్రధాని.. సాధన కోసం అందరూ ఏకం కావాలని మోదీ పిలుపు |

Last Updated:Oct 23, 2026 5:39 PM ISTPM Modi: 2047వ సంవత్సరం నాటికి 'వికసిత భారతం' (Developed India)ను నిర్మించే లక్ష్యంలో భాగస్వాములు కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి పౌరుడికి పిలుపునిచ్చారు. 'వికసిత భారతం' సాకారం కావాలంటే సామాజిక ఐక్యత, స్వయం సమృద్ధి స్ఫూర్తి, యువత చురుకైన భాగస్వామ్యం, భారతీయ సాంస్కృతిక విలువలపై అవగాహన ఎంతో అవసరమని ఆయన నొక్కి చెప్పారు.
News18PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాజాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. స్వయం సమృద్ధిని ప్రోత్సహించాలని కోరడంతో పాటుగా 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం)ను నిర్మించే లక్ష్యంలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో చిన్మయ మిషన్ నిర్వహించిన 'చిన్మయ అమృత మహోత్సవ గ్లోబల్ కాన్ఫరెన్స్' ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రధాని దేశాభివృద్ధిని , జాతీయ గౌరవాన్ని పెంపొందించడంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తన ప్రసంగం ద్వారా పేర్కొన్నారు.అందరూ ఏకం కావాలి: ప్రధాని మోదీసమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పౌరులలో స్వయం సమృద్ధిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న మోదీ.. అభివృద్ధి చెందిన భారతావనిని నిర్మించే సంకల్పంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలన్నారు. వివిధ సంస్థలకు వేర్వేరు లక్ష్యాలు ఉండవచ్చునని.. అయితే దేశాభివృద్ధి, జాతీయ గౌరవం మాత్రం అందరికీ ఉమ్మడి లక్ష్యాలేనని ప్రధాని స్పష్టం చేశారు.'యువత ఎప్పుడూ నా ప్రాధాన్యతే'ప్రభుత్వ అధినేతగా తన 25 ఏళ్ల పదవీకాలంలో యువత ఎల్లప్పుడూ తన ప్రయత్నాలు, విధానాల కేంద్రబిందువుగా ఉన్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 'చిన్మయ అమృత మహోత్సవం'తో అనుసంధానమైన యువ స్వచ్ఛంద సేవకులను ఆయన అభినందించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ యువ స్వచ్ఛంద సేవకులు సుమారు 300 రోజుల వ్యవధిలో దాదాపు 40,000 కిలోమీటర్లు ప్రయాణించి, లక్ష మందికి పైగా యువతను చేరుకున్నారు.స్వామి చిన్మయానంద సేవలు గుర్తింపు..స్వామి చిన్మయానంద అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన ఆధ్యాత్మిక పురోగతిని వ్యక్తిగత వికాసంతో , జాతీయ పురోగతితో అనుసంధానించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 'గీతా జ్ఞాన యజ్ఞం' వంటి కార్యక్రమాల ద్వారా అలాగే ఉపనిషత్తులు , వేదాంతాలకు సంబంధించిన జ్ఞానాన్ని సామాన్య ప్రజలకు చేరవేసే ప్రయత్నాల ద్వారా ఆయన భారతీయ సంస్కృతి పట్ల గర్వభావనను బలోపేతం చేశారు.భారతదేశ సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణకు ప్రాధాన్యత..సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ గురించి చర్చిస్తున్నప్పుడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మాణానికి ఏకనాథ్ రనడే చేసిన కృషిని ప్రధానమంత్రి మోదీ గుర్తుచేసుకున్నారు. స్వామి చిన్మయానంద ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడమే కాకుండా ఈ ప్రాజెక్టు కోసం మొట్టమొదటి ఆర్థిక విరాళాన్ని కూడా అందించారని మోదీ పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ ధామ్, అయోధ్యలోని రామమందిరం, ఉజ్జయినిలోని మహాకాల్ మహలోక్, అలాగే కేదార్‌నాథ్ , బద్రీనాథ్‌లలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాలకు పునరుజ్జీవం కల్పిస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు.పౌరుల బాధ్యత ఇది..ప్రధానమంత్రి అందించిన ప్రధాన సందేశం ఏమిటంటే అభివృద్ధి చెందిన భారతావనిని నిర్మించడం కేవలం ప్రభుత్వ ప్రయత్నాలతోనే సాధ్యం కాదు. దీనికి సామాజిక ఐక్యత, స్వయం సమృద్ధి స్ఫూర్తి, యువత క్రియాశీల భాగస్వామ్యం, భారతీయ సాంస్కృతిక విలువలపై అవగాహన అవసరం.మరింత చదవండి

Source link