కొనుగోలు చేసే ముందు బంగారం క్యారెట్ లేదా ఫైన్నెస్ మార్కింగ్‌ను పరిశీలించి, HUID నంబర్‌ను BIS కేర్ యాప్ ద్వారా ధృవీకరించుకోవాలి. వజ్రాల ఆభరణాలకు అందుబాటులో ఉంటే గ్రేడింగ్ నివేదికను అడగాలి. పోల్కి, జడావు, రంగురాళ్ల ఆభరణాల్లో ఉపయోగించిన రాళ్ల రకం, నాణ్యత, వాటికి చేసిన ప్రక్రియల గురించి స్పష్టత తీసుకోవాలి. అలాగే బిల్లులో బంగారం నికర బరువు, రాళ్లకు సంబంధించిన వివరాలు, తయారీ ఛార్జీలు, మొత్తం ధర సరిగ్గా పేర్కొన్నారో లేదో తనిఖీ చేయాలి. బంగారం, రాళ్లు, పనితనం ధరలో ఎంత మేరకు భాగమయ్యాయో నగల వ్యాపారిని అడిగి తెలుసుకోవాలి. కొనుగోలు చేసిన తర్వాత ఇన్వాయిస్తో పాటు వజ్రాల గ్రేడింగ్ నివేదికలు, ఇతర ధృవీకరణ పత్రాలను భద్రపరచుకోవాలి. ఇక హాల్‌మార్క్ ఉన్న ఆభరణంలో బంగారం స్వచ్ఛతపై సందేహం ఉంటే, వర్తించే పరీక్షా రుసుములు చెల్లించి BIS గుర్తింపు పొందిన అసెయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ కేంద్రంలో పరీక్షించుకునే అవకాశం కూడా ఉంది. మొత్తంగా, బంగారు హాల్‌మార్క్‌ను మొత్తం ఆభరణానికి నాణ్యత హామీగా భావించకుండా, అందులోని ప్రతి భాగానికి సంబంధించిన వివరాలను విడివిడిగా తెలుసుకోవడమే తెలివైన కొనుగోలు నిర్ణయం.

