ప్రభన్యూస్

Mahesh Babu: ఇదీ వారణాసి రేంజ్..! వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేక్ అయ్యేలా రాజమౌళి క్రేజీ స్టెప్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘వారణాసి’తో కేవలం భారతీయ మార్కెట్‌ను మాత్రమే కాకుండా ప్రపంచ బాక్సాఫీస్‌ను నేరుగా కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు రాజమౌళి. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఓ స్పెషల్ మూవీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

News18
News18

దర్శకధీరుడు రాజమౌళి తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’తో కేవలం భారతీయ మార్కెట్‌ను మాత్రమే కాకుండా ప్రపంచ బాక్సాఫీస్‌ను నేరుగా కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. బ్రెజిల్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ వేదికపై మాట్లాడిన ఆయన, తన భవిష్యత్ ప్రణాళికలను పంచుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్‌ను సైతం కైవసం చేసుకుని సంచలనం సృష్టించినప్పటికీ, ఆ చిత్రాన్ని విదేశీ ప్రేక్షకులు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనే వీక్షించారని రాజమౌళి గుర్తుచేశారు. అయితే ‘వారణాసి’ చిత్రంతో ఆ డిజిటల్ ట్రెండ్‌ను మార్చి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను నేరుగా థియేటర్లకు రప్పించాలనేది తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

మొబైల్ ఫోన్లు, టీవీ స్క్రీన్లకే పరిమితం కాకుండా తన సినిమాలోని విజువల్ వండర్స్‌ను ప్రేక్షకులు అతిపెద్ద స్క్రీన్లపైనే ఆస్వాదించాలని ఆయన అన్నారు. ఇందుకోసం బ్రెజిల్‌తో సహా లాటిన్ అమెరికా, ఇతర ప్రధాన దేశాల్లోని భారీ థియేటర్లలో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేసేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారు జక్కన్న. అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా తెరకెక్కనున్న ఈ చిత్రం, అన్నీ అనుకున్నట్లు జరిగితే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయం. భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ప్రపంచ థియేట్రికల్ రిలీజ్ కోసం రాజమౌళి టీమ్ కసరత్తులు వేగవంతం చేసింది.

మహేష్ బాబు (Mahesh Babu), ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈ క్రేజీ మూవీకి 150 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.1361 కోట్లు అవుతుందని టాక్. రాజమౌళి లాస్ట్ సినిమా RRR కంటే ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. దీంతో 2027 ఏప్రిల్ 7న రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్‌ ఫీస్ట్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

వారణాసి భారీ ఖర్చు వెనక చాలా కారణాలే ఉన్నాయి.  ఈ సినిమాకి భారీ విజువల్ ఎఫెక్ట్స్, లాంగ్ షూటింగ్ షెడ్యూల్ అవసరం. ఇండియా, కెన్యా అడవులతో పాటు ఏడు కంటే ఎక్కువ దేశాల్లో సినిమా షూట్‌ చేశారు. అంటార్కిటికాలో తీసిన అతి కొద్ది సినిమాల్లో వారణాసి కూడా చోటు దక్కించుకుంది. సినిమాలోని కొన్ని సీన్స్‌ షూట్‌ చేయడానికి ఐమాక్స్ కెమెరాలను ఉపయోగించారని రాజమౌళి కన్‌ఫర్మ్‌ చేశారు. దీనికి చాలా ఖర్చు అవుతుంది. ప్రొడక్షన్‌ స్కేల్‌, ఇంటర్నేషనల్ లొకేషన్స్‌, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కలిసి బడ్జెట్‌ను రికార్డు స్థాయికి తీసుకెళ్లాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 October 2026, 6:28 pm Digital Edition : Prabhanews
Mahesh Babu: ఇదీ వారణాసి రేంజ్..! వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేక్ అయ్యేలా రాజమౌళి క్రేజీ స్టెప్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 24, 2026 5:22 PM IST‘వారణాసి’తో కేవలం భారతీయ మార్కెట్‌ను మాత్రమే కాకుండా ప్రపంచ బాక్సాఫీస్‌ను నేరుగా కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు రాజమౌళి. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఓ స్పెషల్ మూవీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. News18దర్శకధీరుడు రాజమౌళి తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’తో కేవలం భారతీయ మార్కెట్‌ను మాత్రమే కాకుండా ప్రపంచ బాక్సాఫీస్‌ను నేరుగా కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. బ్రెజిల్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ వేదికపై మాట్లాడిన ఆయన, తన భవిష్యత్ ప్రణాళికలను పంచుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్‌ను సైతం కైవసం చేసుకుని సంచలనం సృష్టించినప్పటికీ, ఆ చిత్రాన్ని విదేశీ ప్రేక్షకులు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనే వీక్షించారని రాజమౌళి గుర్తుచేశారు. అయితే ‘వారణాసి’ చిత్రంతో ఆ డిజిటల్ ట్రెండ్‌ను మార్చి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను నేరుగా థియేటర్లకు రప్పించాలనేది తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.మొబైల్ ఫోన్లు, టీవీ స్క్రీన్లకే పరిమితం కాకుండా తన సినిమాలోని విజువల్ వండర్స్‌ను ప్రేక్షకులు అతిపెద్ద స్క్రీన్లపైనే ఆస్వాదించాలని ఆయన అన్నారు. ఇందుకోసం బ్రెజిల్‌తో సహా లాటిన్ అమెరికా, ఇతర ప్రధాన దేశాల్లోని భారీ థియేటర్లలో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేసేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారు జక్కన్న. అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా తెరకెక్కనున్న ఈ చిత్రం, అన్నీ అనుకున్నట్లు జరిగితే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయం. భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ప్రపంచ థియేట్రికల్ రిలీజ్ కోసం రాజమౌళి టీమ్ కసరత్తులు వేగవంతం చేసింది.మహేష్ బాబు (Mahesh Babu), ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈ క్రేజీ మూవీకి 150 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.1361 కోట్లు అవుతుందని టాక్. రాజమౌళి లాస్ట్ సినిమా RRR కంటే ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. దీంతో 2027 ఏప్రిల్ 7న రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్‌ ఫీస్ట్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.వారణాసి భారీ ఖర్చు వెనక చాలా కారణాలే ఉన్నాయి.  ఈ సినిమాకి భారీ విజువల్ ఎఫెక్ట్స్, లాంగ్ షూటింగ్ షెడ్యూల్ అవసరం. ఇండియా, కెన్యా అడవులతో పాటు ఏడు కంటే ఎక్కువ దేశాల్లో సినిమా షూట్‌ చేశారు. అంటార్కిటికాలో తీసిన అతి కొద్ది సినిమాల్లో వారణాసి కూడా చోటు దక్కించుకుంది. సినిమాలోని కొన్ని సీన్స్‌ షూట్‌ చేయడానికి ఐమాక్స్ కెమెరాలను ఉపయోగించారని రాజమౌళి కన్‌ఫర్మ్‌ చేశారు. దీనికి చాలా ఖర్చు అవుతుంది. ప్రొడక్షన్‌ స్కేల్‌, ఇంటర్నేషనల్ లొకేషన్స్‌, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కలిసి బడ్జెట్‌ను రికార్డు స్థాయికి తీసుకెళ్లాయి.మరింత చదవండి

Source link