అనారోగ్య బాధతో వ్యక్తి ఆత్మహత్య.. భిక్నూర్‌లో విషాదం
ప్రభ న్యూస్, కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 21:
భిక్నూర్ మండలానికి చెందిన గజ్జె స్వామి (56) అనారోగ్య బాధతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. స్వామి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్యంలో మెరుగుదల లేకపోవడంతో మానసిక వేదనకు గురైనట్లు తెలిపారు.
ఈ క్రమంలో సెప్టెంబర్ 20న సాయంత్రం 5:30 గంటల సమయంలో పాత ఇంటిలో దూలానికి ప్లాస్టిక్ వైరుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
మృతుడి భార్య భూలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భిక్నూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై అనిల్ తెలిపారు.

