భారత బ్యాంకింగ్ చరిత్రలో ఎక్కువ రోజులు కొనసాగిన మరికొన్ని సమ్మెలు కూడా ఉన్నాయి. అందుబాటులో ఉన్న చారిత్రక వివరాల్లో నమోదైన సంఖ్యలు ఇలా ఉన్నాయి. 1972లో ఆంధ్రా బ్యాంక్ అధికారులు సమ్మె 63 రోజులు, 1951లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమ్మె 49 రోజులు, 1946లో ఇంపీరియల్ బ్యాంక్ సమ్మె 45 రోజులు, 1987లో ఆర్బీఐ, బెంగళూరు సమ్మె 42 రోజులు, 1946లో నేషనల్ బ్యాంక్ సమ్మె 36 రోజులు, 1960లో ఎస్బీఐ అవార్డ్ స్టాఫ్ సమ్మె 21 రోజులు, 1970లో ఆర్బీఐ, ముంబై సమ్మె 18 రోజులు, 1969లో ఎస్బీఐ అధికారులు/ఏఐఎస్బీఓఎఫ్ సమ్మె 17 రోజులు జరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)

