విరాట్ కూడా చంద్రపై తనకున్న ప్రత్యేక నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, “నువ్వు నా కోసం వచ్చావు, లేకపోతే నేను ఏమైపోయేవాడినో” అని ఆందోళన వ్యక్తం చేస్తాడు. వీరి వల్ల విరాట్‌కు మేలు జరుగుతుందని భావించిన దాక్షాయణి, చంద్ర మరియు మదన్‌లను ఇంట్లోనే ఉండేందుకు అనుమతి ఇస్తుంది. అయితే ఇది సహించలేని శ్రీజ, “నా కాబోయే భర్తతో ఎక్కువ చనువుగా ఉండొద్దు” అని చంద్రను బెదిరించడం కొత్త వివాదానికి దారితీసేలా ఉంది. (Photo Credit: Ninnu Kori Serial Star Maa / Jio + Hotstar)

