Last Updated:
నేడు (సెప్టెంబర్ 17) భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
నేడు (సెప్టెంబర్ 17) భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ.. దేశానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు.
”దేశానికి సేవ చేయాలనే మీ పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. బలమైన, స్వావలంబన కలిగిన భారత్ కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీ సేవా స్ఫూర్తి కోట్లాది మందిని ప్రభావితం చేస్తోంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన దేశానికి మరెన్నో సంవత్సరాలు సేవ చేసే శక్తి, అవకాశం మీకు లభించాలని ఆకాంక్షిస్తున్నాం. రాబోయే సంవత్సరం మీ జీవితంలో మరిన్ని విజయాలు, సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు సార్” అని పోస్ట్ పెట్టారు చిరంజీవి.
Warm birthday wishes to our Hon’ble Prime Minister Shri @narendramodi Ji. 💐
Your journey reflects remarkable determination, discipline and an unwavering commitment to serving Bharat. Your vision for a stronger, self-reliant India and your spirit of Seva continue to inspire…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 17, 2026
“ప్రధాని నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ బలం, వివేకం, సంకల్పం మరింత బలపడాలని కోరుకుంటున్నాను. మన గొప్ప దేశాన్ని నడిపించే మీ నిస్వార్థ ప్రయాణంలో మీకు ఆరోగ్యం, మనశ్శాంతి, అపారమైన శక్తి లభించాలని కోరుకుంటున్నా. #HappyBirthDayNarendraModiJi” అని అక్కినేని నాగార్జున పోస్ట్ పెట్టారు.
Heartiest birthday wishes to Hon’ble Prime Minister Shri @NarendraModi Ji. 🙏
May your strength, wisdom, and unwavering resolve grow stronger and every challenge strengthen your spirit and deepen your purpose.
Wishing you good health, inner peace, and boundless energy for your…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 17, 2026
A life dedicated to Bharat. A journey of service that continues to shape the aspirations of a Nation. 25 years of selfless service, with many more years of dedicated service to Bharat ahead.
On the birthday of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, I extend my heartfelt… pic.twitter.com/agCto7jew8
— Pawan Kalyan (@PawanKalyan) September 17, 2026
భారత్‌కు అంకితమైన జీవితం మీది. ఒక దేశ ఆకాంక్షలను, ఆశయాలను తీర్చిదిద్దుతూ కొనసాగుతున్న సేవా ప్రయాణం. 25 ఏళ్ల నిస్వార్థ ప్రజాసేవ మీది. రాబోయే సంవత్సరాల్లో కూడా భారత్‌కు మీరు చేసే సేవ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. మీరు చూపుతున్న అచంచలమైన నిబద్ధతకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పేర్కొంటూ స్టార్ హీరో, ఏపీ ఉప ముఖ్యమంతి పవన్ కళ్యాణ్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

