ప్రభన్యూస్

Paathaku Praanam: ‘శంకరాభరణం’ స్ఫూర్తితో కొత్త కథ.. ‘పాటకు ప్రాణం’ మూవీపై పెరుగుతున్న అంచనాలు! | తెలుగు సినిమా వార్తలు


యువ నటులు సుదర్శన్ వంగల, సాత్విక ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కీలక పాత్రలో కనిపించనుండగా.. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, రఘు కారుమంచి, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. సంగీతానికి కథలోనే కీలకమైన స్థానం ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

దర్శకుడు హేమల్ తుమ్మపూడి మాట్లాడుతూ.. తన తొలి సినిమాకు మద్దతుగా వచ్చిన మీడియా ప్రతినిధులకు, ముఖ్య అతిథులుగా హాజరైన నిఖిల్, సురేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 60 ఏళ్లుగా వెనుకబడిపోయిన రామయ్య అనే వ్యక్తి, 20 ఏళ్ల యువకుడు కలిసి ప్రారంభించే మ్యూజికల్ జర్నీ చుట్టూ కథ సాగుతుందని వెల్లడించారు. ఇది న్యూ ఏజ్ మ్యూజికల్ డ్రామా అని, సినిమాలో పాటలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. శేఖర్ చంద్ర అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మంచి తేదీని చూసుకుని సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. దర్శకుడు హేమల్‌కు సినిమాపై ఉన్న ప్యాషన్, నమ్మకం స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఎన్నారై అయినప్పటికీ సినిమా చేయాలనే తపనతో ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అంకితభావంతో తెరకెక్కిస్తున్నారని చెప్పారు. ‘పాటకు ప్రాణం’లో కథే పాటల చుట్టూ తిరుగుతుందని, సాధారణంగా సినిమాల్లో కథకు అనుగుణంగా పాటలు వస్తే.. ఈ చిత్రంలో పాటలే కథలో కీలక భాగంగా ఉంటాయని వివరించారు. గతంలో ‘శంకరాభరణం’లో కనిపించిన సంగీత స్ఫూర్తి ఈ సినిమాలోనూ కనిపిస్తుందని, అయితే ఈ చిత్రాన్ని ఆ సినిమాతో పోల్చడం లేదని స్పష్టం చేశారు.

పాత తరం సంప్రదాయ సంగీత విద్వాంసుడికి, ప్రస్తుత జెన్-జెడ్ సంగీతకారుడికి మధ్య ఏర్పడే ఆసక్తికరమైన అనుబంధం, వారి మ్యూజికల్ జర్నీ ఈ సినిమాలో ప్రత్యేకంగా ఉండబోతుందని తనికెళ్ల భరణి తెలిపారు. ఇలాంటి కథలు భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తినిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. జెన్-జెడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి విభిన్నమైన సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు హేమల్‌ను అభినందించారు. ఈ మ్యూజికల్ జర్నీ ప్రేక్షకులను అలరించడంతో పాటు స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. ‘లిటిల్ హార్ట్స్’ తర్వాత అనితా చౌదరితో మరోసారి కలిసి నటిస్తున్నానని, మంచి స్క్రిప్ట్‌తో తమ కాంబినేషన్ మరోసారి ఆకట్టుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

అనితా చౌదరి మాట్లాడుతూ.. హేమల్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఫోన్‌లో కథ చెప్పినప్పుడే దర్శకుడిలో ఉన్న ఎనర్జీ, కాన్ఫిడెన్స్ తనకు నచ్చాయని తెలిపారు. ఈ సినిమాలో సుధర్శన్ తల్లి పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.

హీరో సుదర్శన్ వంగల మాట్లాడుతూ.. తాను అరుణ్ అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఇంతమంది ప్రతిభావంతులైన నటీనటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. హీరోయిన్ సాత్విక తన పాత్ర రాధ అని, అరుణ్ జీవిత ప్రయాణంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని తెలిపారు.

నిర్మాత శ్రీరామ్ తుమ్మపూడి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. డీఓపీ సంజీత్ సింగ్, ఎడిటర్ ప్రభాత్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్ట్‌పై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 September 2026, 10:26 pm Digital Edition : Prabhanews
Paathaku Praanam: ‘శంకరాభరణం’ స్ఫూర్తితో కొత్త కథ.. ‘పాటకు ప్రాణం’ మూవీపై పెరుగుతున్న అంచనాలు! | తెలుగు సినిమా వార్తలు

యువ నటులు సుదర్శన్ వంగల, సాత్విక ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కీలక పాత్రలో కనిపించనుండగా.. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, రఘు కారుమంచి, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. సంగీతానికి కథలోనే కీలకమైన స్థానం ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.దర్శకుడు హేమల్ తుమ్మపూడి మాట్లాడుతూ.. తన తొలి సినిమాకు మద్దతుగా వచ్చిన మీడియా ప్రతినిధులకు, ముఖ్య అతిథులుగా హాజరైన నిఖిల్, సురేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 60 ఏళ్లుగా వెనుకబడిపోయిన రామయ్య అనే వ్యక్తి, 20 ఏళ్ల యువకుడు కలిసి ప్రారంభించే మ్యూజికల్ జర్నీ చుట్టూ కథ సాగుతుందని వెల్లడించారు. ఇది న్యూ ఏజ్ మ్యూజికల్ డ్రామా అని, సినిమాలో పాటలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. శేఖర్ చంద్ర అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మంచి తేదీని చూసుకుని సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. దర్శకుడు హేమల్‌కు సినిమాపై ఉన్న ప్యాషన్, నమ్మకం స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఎన్నారై అయినప్పటికీ సినిమా చేయాలనే తపనతో ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అంకితభావంతో తెరకెక్కిస్తున్నారని చెప్పారు. ‘పాటకు ప్రాణం’లో కథే పాటల చుట్టూ తిరుగుతుందని, సాధారణంగా సినిమాల్లో కథకు అనుగుణంగా పాటలు వస్తే.. ఈ చిత్రంలో పాటలే కథలో కీలక భాగంగా ఉంటాయని వివరించారు. గతంలో ‘శంకరాభరణం’లో కనిపించిన సంగీత స్ఫూర్తి ఈ సినిమాలోనూ కనిపిస్తుందని, అయితే ఈ చిత్రాన్ని ఆ సినిమాతో పోల్చడం లేదని స్పష్టం చేశారు.పాత తరం సంప్రదాయ సంగీత విద్వాంసుడికి, ప్రస్తుత జెన్-జెడ్ సంగీతకారుడికి మధ్య ఏర్పడే ఆసక్తికరమైన అనుబంధం, వారి మ్యూజికల్ జర్నీ ఈ సినిమాలో ప్రత్యేకంగా ఉండబోతుందని తనికెళ్ల భరణి తెలిపారు. ఇలాంటి కథలు భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తినిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. జెన్-జెడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి విభిన్నమైన సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు హేమల్‌ను అభినందించారు. ఈ మ్యూజికల్ జర్నీ ప్రేక్షకులను అలరించడంతో పాటు స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. ‘లిటిల్ హార్ట్స్’ తర్వాత అనితా చౌదరితో మరోసారి కలిసి నటిస్తున్నానని, మంచి స్క్రిప్ట్‌తో తమ కాంబినేషన్ మరోసారి ఆకట్టుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.అనితా చౌదరి మాట్లాడుతూ.. హేమల్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఫోన్‌లో కథ చెప్పినప్పుడే దర్శకుడిలో ఉన్న ఎనర్జీ, కాన్ఫిడెన్స్ తనకు నచ్చాయని తెలిపారు. ఈ సినిమాలో సుధర్శన్ తల్లి పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.హీరో సుదర్శన్ వంగల మాట్లాడుతూ.. తాను అరుణ్ అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఇంతమంది ప్రతిభావంతులైన నటీనటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. హీరోయిన్ సాత్విక తన పాత్ర రాధ అని, అరుణ్ జీవిత ప్రయాణంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని తెలిపారు.నిర్మాత శ్రీరామ్ తుమ్మపూడి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. డీఓపీ సంజీత్ సింగ్, ఎడిటర్ ప్రభాత్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్ట్‌పై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది.

Source link