Last Updated:
రష్యా, ఉక్రెయిన్ దేశాలు పరస్పరం ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా డీజిల్ ధరలు తగ్గుముఖం పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచాన్ని తీవ్రంగా కలవరపెడుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాలు ఇకపై పరస్పరం ఇంధన కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేసుకోకూడదని ఒక చారిత్రక ఒప్పందానికి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ ఇంధన స్థావరాలపై దాడులు చేయబోమని రష్యా మాటిచ్చిందని, రష్యా చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోబోమని ఉక్రెయిన్ కూడా అంగీకరించిందని ఆయన వెల్లడించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది.

