వర్షాకాలం వచ్చిందంటే ఇల్లు, పెరడు, మెట్లు, పైకప్పు వంటి ప్రదేశాల్లో పచ్చి నాచు పెరగడం సాధారణమే. వర్షపు నీరు ఎక్కువగా ఉండటం, తేమ అధికంగా ఉండటం, సూర్యరశ్మి తక్కువగా పడటం వంటి కారణాలతో ఈ నాచు త్వరగా వ్యాపిస్తుంది. గోడలు, మెట్లు, టెర్రస్ లేదా నేలపై పచ్చగా, నల్లగా పొరలుగా పేరుకుపోతుంది. ముఖ్యంగా తడిగా ఉన్న ప్రదేశాల్లో నాచు పెరిగితే నేల జారే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వర్షాకాలంలో నాచును ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

