ప్రభన్యూస్

రెండు కొండల మధ్య అద్భుత దృశ్యం.. 5 వేల మంది విద్యార్థులతో తలుపులమ్మ క్షేత్రం కళకళ..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

అడవిలో అమ్మవారి ఆలయానికి ఒకేసారి 5000 మంది యువతులు వచ్చారు ఎందుకో తెలుసా

+

News18

News18

పచ్చని అటవీ ప్రాంతం.. రెండు కొండల మధ్య వెలసిన దివ్యమైన అమ్మవారి ఆలయం.. గోపురం ముందు వందలాది మెట్లపై ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఐదు వేల మంది విద్యార్థులు ఒకేసారి కూర్చొని ఇచ్చిన ఫొటోకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం, క్రమశిక్షణ కలిసిన ఈ అరుదైన దృశ్యం చూసిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. “ఇలాంటి కమనీయమైన ఆధ్యాత్మిక ఘట్టం మళ్లీ ఎప్పుడు చూస్తామో అంటూ నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా పేరుగాంచిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి క్షేత్రంలో ఆషాఢ మాస మహోత్సవాలకు శుక్రవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. మహోత్సవాల ప్రారంభ సందర్భంగా సమీప ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు ఐదు వేల మంది విద్యార్థినులు అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన ప్రత్యేక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి భావంతో మార్మోగిపోగా, విద్యార్థినుల సమిష్టి ప్రార్థనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాయి.

ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి విశ్వనాథ్ రాజు ప్రత్యేకంగా విద్యార్థులను ఆలయ గోపురం ముందున్న మెట్లపై వరుసలుగా కూర్చోబెట్టి సామూహిక ఫొటో ఏర్పాటు చేశారు. రెండు కొండల మధ్య అద్భుతంగా కనిపించే గోపురం నేపథ్యంలో వేలాది మంది విద్యార్థినులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన దృశ్యం ఎంతో రమణీయంగా నిలిచింది. అనంతరం విద్యార్థినులు అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకుని, “శ్రీ మాత్రే నమః” నామస్మరణతో కుంకుమ పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే యనమల దివ్య హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కుంకుమ పూజల్లో పాల్గొని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తులకు ఎలా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందో, అదే విధంగా లోవలోని శ్రీ తలుపులమ్మ అమ్మవారి క్షేత్రం కూడా విశిష్టమైన దైవిక అనుభూతిని అందిస్తోందని పేర్కొన్నారు.

చక్కని ప్రకృతి ఒడిలో వెలసిన ఈ దివ్యక్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని యనమల దివ్య తెలిపారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఈ ఆలయాన్ని ఉత్తరాంధ్రలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.

ఇదిలా ఉండగా, నేటి నుంచి ప్రారంభమైన ఆషాఢ మాస మహోత్సవాలు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో విశ్వనాథ్ రాజు తెలిపారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని భక్తులకు ఆయన పిలుపునిచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 3:41 pm Digital Edition : Prabhanews
రెండు కొండల మధ్య అద్భుత దృశ్యం.. 5 వేల మంది విద్యార్థులతో తలుపులమ్మ క్షేత్రం కళకళ..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Jul 17, 2026 10:06 PM ISTఅడవిలో అమ్మవారి ఆలయానికి ఒకేసారి 5000 మంది యువతులు వచ్చారు ఎందుకో తెలుసా+
News18పచ్చని అటవీ ప్రాంతం.. రెండు కొండల మధ్య వెలసిన దివ్యమైన అమ్మవారి ఆలయం.. గోపురం ముందు వందలాది మెట్లపై ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఐదు వేల మంది విద్యార్థులు ఒకేసారి కూర్చొని ఇచ్చిన ఫొటోకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం, క్రమశిక్షణ కలిసిన ఈ అరుదైన దృశ్యం చూసిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. "ఇలాంటి కమనీయమైన ఆధ్యాత్మిక ఘట్టం మళ్లీ ఎప్పుడు చూస్తామో అంటూ నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా పేరుగాంచిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి క్షేత్రంలో ఆషాఢ మాస మహోత్సవాలకు శుక్రవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. మహోత్సవాల ప్రారంభ సందర్భంగా సమీప ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు ఐదు వేల మంది విద్యార్థినులు అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన ప్రత్యేక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి భావంతో మార్మోగిపోగా, విద్యార్థినుల సమిష్టి ప్రార్థనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాయి.ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి విశ్వనాథ్ రాజు ప్రత్యేకంగా విద్యార్థులను ఆలయ గోపురం ముందున్న మెట్లపై వరుసలుగా కూర్చోబెట్టి సామూహిక ఫొటో ఏర్పాటు చేశారు. రెండు కొండల మధ్య అద్భుతంగా కనిపించే గోపురం నేపథ్యంలో వేలాది మంది విద్యార్థినులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన దృశ్యం ఎంతో రమణీయంగా నిలిచింది. అనంతరం విద్యార్థినులు అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకుని, "శ్రీ మాత్రే నమః" నామస్మరణతో కుంకుమ పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే యనమల దివ్య హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కుంకుమ పూజల్లో పాల్గొని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తులకు ఎలా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందో, అదే విధంగా లోవలోని శ్రీ తలుపులమ్మ అమ్మవారి క్షేత్రం కూడా విశిష్టమైన దైవిక అనుభూతిని అందిస్తోందని పేర్కొన్నారు.చక్కని ప్రకృతి ఒడిలో వెలసిన ఈ దివ్యక్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని యనమల దివ్య తెలిపారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఈ ఆలయాన్ని ఉత్తరాంధ్రలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.ఇదిలా ఉండగా, నేటి నుంచి ప్రారంభమైన ఆషాఢ మాస మహోత్సవాలు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో విశ్వనాథ్ రాజు తెలిపారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని భక్తులకు ఆయన పిలుపునిచ్చారు.Location :East Godavari,Andhra PradeshFirst Published :Jul 17, 2026 10:06 PM ISTమరింత చదవండి

Source link