Last Updated:
ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతీ వీడియో నిజం అని నమ్మేస్తే, బుర్రపాడు కావడంతో పాటు, మీ జేబు కూడా ఖాళీ అవుతుంది. అలాంటిదే ఈ వీడియో కూడా. ఈ వైరల్ వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
ఆన్‌లైన్‌లో వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్లు, ప్రభుత్వ లోన్ పేరుతో వచ్చే మెసేజ్‌ల విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టుబడి పథకాన్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా కనిపించే ఏఐ వీడియో ఒకటి, ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద లోన్ మంజూరైందంటూ వచ్చిన నకిలీ లేఖ ఒకటి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ రెండూ మోసపూరితమైనవేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన కనిపిస్తోంది. అందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ను ప్రమోట్ చేస్తున్నట్టుగా ఏఐతో తయారు చేసిన వీడియో ఉంది. కేవలం రూ.22,000 పెట్టుబడి పెడితే వారానికి రూ.5.5 లక్షలు సంపాదించవచ్చని ఆ ప్రకటనలో చెబుతున్నారు.

