నీట్ పేపర్ లీకేజీ కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు.
ప్రభ న్యూస్ అమలాపురం జూలై 21:
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న, విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్న వారిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి శిక్షించాలని వైస్సార్సీపీ కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు అన్నారు.దేశావ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనల సందర్భంగా పోలీసుల దురుసు ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసారు. విద్యార్థులపై క్రిమినల్స్ లాగా విరుచుకుపడటం దారుణం. సిబిఐ దర్యాప్తు జరిపి లీక్ లో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చూడాలి.కులం, మతం, ప్రాంతీయవాదం అంటూ ఉపన్యాసాలు ఇచ్చే నేతలు ఈ విద్యా వ్యవస్థలో స్టూడెంట్సకి జరిగిన నష్టం గురించి నోరు విప్పకపోవడం దురదృష్టం.అదే సందర్భంలో విద్యార్థులకు న్యాయం చేయాలనీ నాయుడు డిమాండ్ చేసారు.
వంటెద్దు వెంకన్నాయుడు, (వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి,మండపేట నియోజకవర్గ వైస్సార్సీపీ పరిశీలకులు).

