ప్రభన్యూస్

చిత్తూరులో సీజ్ చేసిన 76 టన్నుల రేషన్ బియ్యాన్ని.. ఏం చేస్తున్నారో తెలుసా.. వాళ్లకి పండగే..! | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

చిత్తూరు జిల్లాలో సీజ్ చేసిన 76.383 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం జూలై 25న బహిరంగ వేలం.

News18
News18

చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యంపై అధికారులు తీసుకున్న చర్యల అనంతరం సీజ్ చేసిన భారీ మొత్తంలో బియ్యాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ (కంట్రోల్) ఆర్డర్–2018 నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం–1955 కింద 6ఏ కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న మొత్తం 76.383 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ నెల 25న బహిరంగ వేలం వేయనున్నట్లు చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్ వెల్లడించారు.

సీజ్ చేసిన బియ్యాన్ని భద్రతా కారణాల దృష్ట్యా జిల్లాలోని వివిధ గోదాముల్లో నిల్వ ఉంచారు. చిత్తూరులో 8.229 మెట్రిక్ టన్నులు, నగరిలో 6.735 మెట్రిక్ టన్నులు, పలమనేరులో 47.650 మెట్రిక్ టన్నులు, శాంతిపురంలో 5.900 మెట్రిక్ టన్నులు, గుడుపల్లె మండలంలో 7.869 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం నిల్వలను యథాతథ స్థితిలో జూలై 25 మధ్యాహ్నం 3 గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లోని వివేకానంద భవనంలో బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు.

వేలంలో పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా రూ.1 లక్ష డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)ను Collector (CS), Chittoor District పేరుతో, ఎస్‌బీఐ గిరింపేట శాఖలో చెల్లుబాటు అయ్యే విధంగా తీసుకురావాలని అధికారులు సూచించారు. అలాగే, కమర్షియల్ ట్యాక్స్ శాఖ జారీ చేసిన జీఎస్‌టీఐ నమోదుతో కూడిన ట్రేడర్ లేదా రైస్ మిల్లర్ లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి. వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో తెలుసుకోవచ్చని వెల్లడించారు.

వేలంలో పాల్గొనదలచిన ట్రేడర్లు, రైస్ మిల్లర్లు బియ్యం నాణ్యతను ముందుగానే పరిశీలించేందుకు కూడా అవకాశం కల్పించారు. ఈ నెల 24వ తేదీలోపు కార్యాలయ పనివేళల్లో ఆయా మండల స్థాయి గోదాములను సందర్శించి నిల్వలను పరిశీలించవచ్చని అధికారులు తెలిపారు. వేలంలో అత్యధిక ధరకు బిడ్ దక్కించుకున్న వారు రవాణా, హమాలీ ఖర్చులను స్వయంగా భరించి, వేలం మొత్తాన్ని చెల్లించిన తేదీ నుంచి 20 రోజుల్లోగా ఆయా స్టాక్ పాయింట్ల నుంచి బియ్యాన్ని విడతల వారీగా తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ బహిరంగ వేలం ప్రక్రియ మొత్తం జిల్లా సంయుక్త కలెక్టర్ తుది నిర్ణయానికి లోబడి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడంపై ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో, సీజ్ చేసిన నిల్వలను చట్టపరమైన విధానంలో బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 11:31 am Digital Edition : Prabhanews
చిత్తూరులో సీజ్ చేసిన 76 టన్నుల రేషన్ బియ్యాన్ని.. ఏం చేస్తున్నారో తెలుసా.. వాళ్లకి పండగే..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Jul 15, 2026 7:29 PM ISTచిత్తూరు జిల్లాలో సీజ్ చేసిన 76.383 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం జూలై 25న బహిరంగ వేలం.News18చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యంపై అధికారులు తీసుకున్న చర్యల అనంతరం సీజ్ చేసిన భారీ మొత్తంలో బియ్యాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ (కంట్రోల్) ఆర్డర్–2018 నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం–1955 కింద 6ఏ కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న మొత్తం 76.383 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ నెల 25న బహిరంగ వేలం వేయనున్నట్లు చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్ వెల్లడించారు.సీజ్ చేసిన బియ్యాన్ని భద్రతా కారణాల దృష్ట్యా జిల్లాలోని వివిధ గోదాముల్లో నిల్వ ఉంచారు. చిత్తూరులో 8.229 మెట్రిక్ టన్నులు, నగరిలో 6.735 మెట్రిక్ టన్నులు, పలమనేరులో 47.650 మెట్రిక్ టన్నులు, శాంతిపురంలో 5.900 మెట్రిక్ టన్నులు, గుడుపల్లె మండలంలో 7.869 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం నిల్వలను యథాతథ స్థితిలో జూలై 25 మధ్యాహ్నం 3 గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లోని వివేకానంద భవనంలో బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు.వేలంలో పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా రూ.1 లక్ష డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)ను Collector (CS), Chittoor District పేరుతో, ఎస్‌బీఐ గిరింపేట శాఖలో చెల్లుబాటు అయ్యే విధంగా తీసుకురావాలని అధికారులు సూచించారు. అలాగే, కమర్షియల్ ట్యాక్స్ శాఖ జారీ చేసిన జీఎస్‌టీఐ నమోదుతో కూడిన ట్రేడర్ లేదా రైస్ మిల్లర్ లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి. వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో తెలుసుకోవచ్చని వెల్లడించారు.వేలంలో పాల్గొనదలచిన ట్రేడర్లు, రైస్ మిల్లర్లు బియ్యం నాణ్యతను ముందుగానే పరిశీలించేందుకు కూడా అవకాశం కల్పించారు. ఈ నెల 24వ తేదీలోపు కార్యాలయ పనివేళల్లో ఆయా మండల స్థాయి గోదాములను సందర్శించి నిల్వలను పరిశీలించవచ్చని అధికారులు తెలిపారు. వేలంలో అత్యధిక ధరకు బిడ్ దక్కించుకున్న వారు రవాణా, హమాలీ ఖర్చులను స్వయంగా భరించి, వేలం మొత్తాన్ని చెల్లించిన తేదీ నుంచి 20 రోజుల్లోగా ఆయా స్టాక్ పాయింట్ల నుంచి బియ్యాన్ని విడతల వారీగా తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఈ బహిరంగ వేలం ప్రక్రియ మొత్తం జిల్లా సంయుక్త కలెక్టర్ తుది నిర్ణయానికి లోబడి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడంపై ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో, సీజ్ చేసిన నిల్వలను చట్టపరమైన విధానంలో బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.Location :Chittoor,Chittoor,Andhra Pradeshమరింత చదవండి

Source link