కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌పై అప్రమత్తత.. 24 గంటల్లో ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం
ప్రభ న్యూస్, సెప్టెంబర్ 23:
కౌలాస్ నాలా ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో ప్రాజెక్ట్‌కు వచ్చే వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. సెప్టెంబర్ 23 సాయంత్రం 6 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 457.83 మీటర్లుగా ఉండగా, గరిష్ట నీటి నిల్వ మట్టం 458.00 మీటర్లుగా ఉందని తెలిపారు.
ఇన్‌ఫ్లో పరిస్థితులను బట్టి అవసరమైతే ప్రాజెక్ట్ వరద గేట్లను ఎత్తి అదనపు నీటిని కౌలాస్ నాలా వాగులోకి విడుదల చేయాల్సి రావచ్చని అధికారులు పేర్కొన్నారు. దీంతో దిగువ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా చేపలు పట్టేవారు, పశువులు, గొర్రెల కాపరులు, రైతులు, ఇతరులు వాగులోకి లేదా వాగు పరిసర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే పరిస్థితి ఏర్పడితే ముందుగానే ప్రత్యేక హెచ్చరిక జారీ చేసి, నీటి విడుదల సమయం, విడుదల చేసే నీటి పరిమాణం తదితర వివరాలను ప్రజలకు తెలియజేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
