ప్రభన్యూస్

కవచ్ 4.0 అప్‌గ్రేడేషన్‌పై రైల్వే జీఎం పరిశీలన..

మల్కాజిగిరి–కామారెడ్డి రైల్వే మార్గంలో ‘కవచ్ 4.0’కు అప్‌గ్రేడ్..

108 రూట్ కిలోమీటర్లలో ఆధునిక రైలు రక్షణ వ్యవస్థ పనులు పూర్తి..

కామారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి స్టేషన్లలో అమృత్ భారత్ పనులపై సమీక్ష

ప్రభ న్యూస్, సెప్టెంబర్ 22:

మల్కాజిగిరి–కామారెడ్డి రైల్వే మార్గంలో కవచ్ రక్షణ వ్యవస్థను వెర్షన్ 3.2 నుంచి 4.0కి అప్‌గ్రేడ్ చేసిన పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు. మంగళవారం ప్రత్యేక రైలులో ప్రయాణిస్తూ ఈ మార్గంలోని కవచ్ 4.0 వ్యవస్థ పనితీరును వివిధ సందర్భాల్లో పరిశీలించారు.
ఈ తనిఖీలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ పి.వి. మురళీకృష్ణ, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.దక్షిణ మధ్య రైల్వేలో తొలిసారిగా మల్కాజిగిరి–కామారెడ్డి సెక్షన్‌లో 108 రూట్ కిలోమీటర్ల మేర కవచ్ వెర్షన్ 3.2 నుంచి 4.0కి అప్‌గ్రేడ్ చేయడం పూర్తయింది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేలో 1,465 రూట్ కిలోమీటర్ల మేర కవచ్ వెర్షన్ 3.2ను అమలు చేసిన అనుభవంతో మరిన్ని సాంకేతిక మెరుగుదలలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.కవచ్ 4.0లో అధునాతన భద్రతా ప్రమాణాలు, మెరుగైన సాంకేతికత, అధిక విశ్వసనీయతతో పాటు సురక్షితమైన రైలు కార్యకలాపాలకు అవసరమైన పలు ప్రత్యేకతలను పొందుపరిచారు. ముఖ్యంగా రైళ్ల స్థానాన్ని మరింత ఖచ్చితంగా గుర్తించడం, పెద్ద యార్డుల్లో సిగ్నల్ అంశాలపై మెరుగైన సమాచారం అందించడం, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా స్టేషన్‌-టు-స్టేషన్ కవచ్ ఇంటర్‌ఫేస్ ఏర్పాటు, ఇప్పటికే ఉన్న ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థతో నేరుగా అనుసంధానం వంటి సౌకర్యాలు ఉన్నాయి.కవచ్ వ్యవస్థ మానవ తప్పిదాల కారణంగా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడకుండా అదనపు భద్రతా వ్యవస్థగా పనిచేస్తుందని సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. సిగ్నల్‌ను దాటి వెళ్లడం, అధిక వేగంతో రైళ్లు నడపడం, ఢీకొనడం వంటి ప్రమాదాలను తగ్గించడంతో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ రైలు కార్యకలాపాల భద్రతను పెంచుతుందని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని ఇతర సెక్షన్లలోనూ కవచ్ అమలు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
అనంతరం కామారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి రైల్వే స్టేషన్లను జనరల్ మేనేజర్ పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కొనసాగుతున్న స్టేషన్ పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రయాణికుల సౌకర్యాలు, స్టేషన్ ప్రాంగణం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపడుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 September 2026, 9:53 pm Digital Edition : Prabhanews
<b>కవచ్ 4.0 అప్‌గ్రేడేషన్‌పై రైల్వే జీఎం పరిశీలన</b>..